మళ్లీ రెమ్యునరేషన్ ను పెంచేసిన సిధ్ శ్రీరామ్.. ఒక పాటకు ఎంతంటే?

ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సింగర్లలో సిధ్ శ్రీరామ్ కూడా ఒకరు.

సిధ్ శ్రీరామ్ పాట పాడితే సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వస్తాయి.

ఈ రీజన్ వల్లే చిన్న నిర్మాతలు సైతం తమ సినిమాలలో సిధ్ శ్రీరామ్ ఒక్క పాట పాడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సిధ్ శ్రీరామ్ గొంతులోనే ఏదో మ్యాజిక్ ఉందని ప్రేక్షకులు భావిస్తారు.అటు స్టార్ హీరోలు, ఇటు యంగ్ జనరేషన్ హీరోలు సినిమాలో కచ్చితంగా హిట్ అవుతుందని భావించిన పాటలను సిధ్ శ్రీరామ్ తో పాడిస్తున్నారు.

సిధ్ శ్రీరామ్ పాటలు పాడిన సినిమాలు సక్సెస్ సాధిస్తుండటంతో అతనితో పాటలు పాడించటానికి మ్యూజిక్ డైరెక్టర్లు, దర్శకనిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

అయితే గతంతో పోలిస్తే ఈ స్టార్ సింగర్ రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారని సమాచారం.

"""/"/ ప్రస్తుతం సిధ్ శ్రీరామ్ ఒక్కో పాటకు ఏకంగా 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని బోగట్టా.

చాలామంది గుర్తింపు తెచ్చుకున్న సింగర్లు సైతం ప్రస్తుతం వేల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.

అయితే సిధ్ శ్రీరామ్ మాత్రం అంచనాలకు అందని స్థాయిలో రెమ్యునరేషన్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

సిధ్ శ్రీరామ్ పాట పాడితే ఆ పాట సెన్సేషన్ అవుతున్న నేపథ్యంలో సిధ్ శ్రీరామ్ డిమాండ్ కు అనుగుణంగా నిర్మాతలు పారితోషికం ఇస్తున్నారు.

సిధ్ శ్రీరామ్ క్రేజ్ ను చూసి ఇతర సింగర్లు సైతం షాకవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

సిధ్ శ్రీరామ్ కు తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.

సిధ్ శ్రీరామ్ కు సంవత్సరంసంవత్సరానికి అంతకంతకూ క్రేజ్ పెరుగుతోంది.

రెండు రోజుల్లో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల..: వైవీ సుబ్బారెడ్డి