పెళ్లి పీటలెక్కనున్నానని శుభవార్త చెప్పిన బాహుబలి గాయని.. ఏమైందంటే?

బాహుబలి సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆ సినిమా ఊహించని స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా రిజల్ట్ చాలామంది జీవితాలను మార్చేసింది.బాహుబలి ద్వారా సింగర్ గా పాపులారిటీని సంపాదించుకున్న యామిని సత్య తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సత్య యామిని బాహుబలి సినిమాలో మమతల తల్లి అనే సాంగ్ పాడింది.సత్య యామిని షేర్ చేసిన ఫోటోలను చూసి ఈ జోడీ బాగుందని కామెంట్లు చేస్తున్నారు.

భర్తను పరిచయం చేస్తూ సత్య యామిని జీవిత కాలానికి సంబంధించిన రోలర్ కోస్టర్ వేచి ఉంది అని చెప్పుకొచ్చారు.

ఫోటోలను చూసిన ఇతర సింగర్స్ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు క్యూట్ జోడీ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

యామిని భర్త ఫోటో వైరల్ అవుతున్నా అతనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

"""/"/ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ ఛానల్ లో ప్రసారమైన ప్రోగ్రామ్స్ కూడా యామినికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

బాహుబలి2 సినిమా తర్వాత సత్య యామిని పేరు మారుమ్రోగడంతో పాటు ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి.

అఖండ, బింబిసార సినిమాలలోని సత్య యామిని పాటలకు ప్రేక్షకుల నుంచి ఊహించని రేంజ్ లో ప్రశంసలు దక్కాయనే సంగతి తెలిసిందే.

సత్య యామిని కెరీర్ పరంగా మరెన్నో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సింగర్ గా ఆమెకు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సత్య యామిని రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది.

సత్య యామినిని అభిమానించే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంది.సత్య యామినికి క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ రెడీ .. షెడ్యూల్ ఇలా .