నూతన గృహప్రవేశం చేసిన సింగర్ రేవంత్… వైరల్ అవుతున్న ఫోటోలు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ రేవంత్( Revanth ) ఒకరు.

ఈయన ప్లే బాక్స్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ముఖ్యంగా బాహుబలి సినిమాలో మనోహరి అనే పాటతో ఎంతో ఫేమస్ అయినటువంటి అనంతరం ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్లో కూడా విజేతగా నిలిచారు.

ఈ విధంగా సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అన్విత( Anvitha ) అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

ఇక ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా జన్మించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ చిన్నారి రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో జన్మించిన సంగతి తెలిసిందే.

ప్రతి బిగ్ బాస్ సీజన్ కార్యక్రమంలో ఒక సింగర్ కి అవకాశం కల్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

"""/" / ఈ క్రమంలోనే బిగ్ బాస్( Bigg Boss )సీజన్ 6 కార్యక్రమంలో రేవంత్ కంటెస్టెంట్ గా వెళ్లి కప్పుతో బయటకు వచ్చారు.

ఈయన హౌస్ లోకి వెళ్లే సమయానికి తన భార్య ఆరు నెలల ప్రెగ్నెంట్ తన హౌస్ లో ఉండగానే తన భార్య సీమంతపు వేడుక జరగడం తనకు కూతురు జన్మించడం జరిగింది అయితే ఈ స్పెషల్ వీడియోస్ అన్నింటిని కూడా బిగ్ బాస్ రేవంత్ కోసం ప్రత్యేకంగా ప్లే చేయడంతో ఈయన హౌస్ లో ఉన్న సమయంలో ఎంతో ఎమోషనల్ అయ్యారు.

"""/" / ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే ఈయన ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

బిగ్ బాస్ తర్వాత రేవంత్ తిరిగి తన వృత్తిపరమైన జీవితంలో బిజీ అయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈయన నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సింగర్ రేవంత్ భార్య అన్విత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

దీంతో ఈ ఫోటోలు వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి.రేవంత్ అన్విత ఇద్దరు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులను ధరిస్తూ గృహప్రవేశానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈ ఫోటోలను చూసి ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ర‌క్త‌దానం ప్ర‌యోజ‌నాలేంటి.. ఎవ‌రు చేయాలి? ఎవ‌రు చేయ‌కూడ‌దు?