వామ్మో.. సింగర్ మంగ్లీ ఒక్క పాటకు అన్ని రూ.లక్షలు పారితోషికం అందుకుంటోందా?

తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం ఈమె వెండితెరపై, అలాగే బుల్లితెరపై అవకాశాలతో దూసుకుపోతుంది.

మంగ్లీ ఏ సినిమాలో పాట పాడిన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును ఏర్పరచుకుంటుంది.

భక్తి పాట అయినా, ఐటమ్ సాంగ్ అయినా మంగ్లీ పాట పాడితే ఆ దాని స్థాయి వేరేలా ఉంటుంది చెప్పవచ్చు.

అంతేకాకుండా ఇప్పటివరకు మంగ్లీ పాడిన పాటలు అన్నీ కూడా మంచి సూపర్ హిట్ గా నిలవడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.

మొదట న్యూస్ యాంకర్ కెరియర్ ను స్టార్ట్ చేసిన మంగ్లీ ఆ తర్వాత స్టార్ సింగర్ గా మారిన విషయం తెలిసిందే.

బతుకమ్మ పాటలతో బాగా ఫేమస్ అయ్యి ఆ తర్వాత సినిమాలలో పాటలు పాడే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

అంతే కాకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న సింగర్స్ లో మంగ్లీ కూడా ఒకరు అని చెప్పవచ్చు.

"""/"/ ఇప్పటికే తెలుగులో సింగర్ మంగ్లీ పాడిన రాములో రాముల,జింతక్ చితక్, ఊరంతా వెన్నెల, సారంగదరియా, జ్వాల రెడ్డి లాంటి పాటలు యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ ని తెచ్చి పెట్టడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.

సింగర్ మంగ్లీ పాడిన పాటలు బాగా హీట్ అవ్వడంతో ఆమెకు మరింత గుర్తింపు దక్కింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సింగల్ మంగ్లీ పారితోషికానికి సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి. """/"/ కాగా సింగర్ మంగ్లీ తన క్రేజ్ పెరిగిపోవడంతో పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే మొదట్లో కేవలం ఒక పాటకు రూ.20,000 మాత్రమే తీసుకున్న మంగ్లీ ఇప్పుడు ఒక్కొక్క పాటకు రూ.

2 నుంచి 3 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే సినిమా హిట్ అవడం వెనుక మంగ్లీ పాటలు కూడా కీలకం అవుతుండడంతో నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనకడుగు వేయడం లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా సింగర్ మంగ్లీ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి తాను సొంతంగా నిర్మించిన పాటలను ఆ యూట్యూబ్ ఖాతాలో విడుదల చేస్తూ యూట్యూబ్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది.

అలాగే అప్పుడప్పుడు ఈవెంట్లను తన పాటలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ద్వారా ఈవెంట్ ల ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది.

రాశిఖన్నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది?