సొంత డబ్బులతో ఆలయాన్ని నిర్మించిన సింగర్ మంగ్లీ.. ఎక్కడో తెలుసా?

జానపద గేయాలను పాడుతూ వీడియోలు చేయడమే కాకుండా ప్రతి పండుగకు పెద్ద ఎత్తున పాటలు పాడుతూ డాన్స్ వీడియోల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ మంగ్లీ గురించి అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా బోనాలు,ఇతర పండుగల సందర్భంగా ప్రత్యేక పాటల ద్వారా ఈమె ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇదే క్రేజ్ తో ఏకంగా ఈమె సినిమా పాటలు పాడుతూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మంగ్లీ ఏకంగా ఆలయాన్ని నిర్మించారు.

ఈమె ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నప్పటికీ తన స్వస్థలం మాత్రం అనంతపురం జిల్లాలోని గుత్తి దగ్గర బసినేపల్లి తండాకు చెందిన వ్యక్తి.

ఇలా తన సొంత గ్రామంలో ఈమె ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించారు.గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామంలో విశేష పూజలు అందుకుంటున్నటువంటి ఆంజనేయస్వామికి మంగ్లీ తన సొంత డబ్బులతో ఆలయం నిర్మించారు.

ఈ ఆలయంలో శ్రీరామనవమి హనుమాన్ జయంతి వంటి పండుగ సందర్భాలలో పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

"""/"/ ఇక ఈ ఆలయం ఎంతో సుందరంగా భారీ ఖర్చుతోనే నిర్మించినట్టు తెలుస్తుంది.

ఇక ఈ ఆలయంలో గర్భగుడి మొత్తం రాతితో ఎంతో అద్భుతంగా నిర్మించడమే కాకుండా గర్భగుడి చుట్టూ ఆంజనేయ స్వామి వివిధ ప్రతిమలతో ఎంతో సుందరంగా నిర్మించారు.

ఇలా బసినే పల్లి తాండాలో సొంత ఖర్చులతో ఈమె ఆలయం నిర్మించారు.ఇక గ్రామస్తులు ప్రతివారం పెద్ద ఎత్తున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

ఇక మంగ్లీ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం తన చెల్లెల్ని కూడా ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయం చేశారు.

ఈమె పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ పాడి మొదటి పాటతోనే ఎంతో మంచి గుర్తింపు పొందారు.

మోదీ సభకు చంద్రబాబు దూరం.. కారణం ఏంటంటే ..?