తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి.. కల్పన సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పనా( Singer Kalpana ) ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.
నిద్రలో మాత్రలు మింగడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆమె హాస్పిటల్ లో ఉన్న సమయంలో ఆమె సూసైడ్ పట్ల అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
భర్త కారణంగా సూసైడ్ చేసుకుంది కూతురి కారణంగా సూసైడ్ చేసుకుంది అంటూ రకరకాల వార్తలు వినిపించాయి.
ఈ విషయం పట్ల కూతురు స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తెలిపిన విషయం తెలిసిందే.
అయితే ఈ సంఘటన నుంచి కోరుకున్న కల్పన ఒక వీడియోని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
"""/" /
తనకు ఏమీ కాలేదని క్షేమంగా ఉన్నానని సోషల్ మీడియాలో వస్తున్న సత్య ప్రచారాలను నమ్మ వద్దు అని ఆమె తెలిపింది.
తన భర్త కారణంగా తాను సూసైడ్ చేసుకున్నాను అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు.
తాను ఆత్మహత్యాయత్నం( Suicide Attempt ) చేయలేదని తెలిపారు.నిద్ర మాత్రల మోతాదు ఎక్కువడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు చెప్పారు.
ఈ క్రమంలో సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల వేదికగా కల్పన పరిస్థితిపై కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చాయి.
ఆమె ఆత్మహత్యాయత్నం చేశారంటూ వార్తలు రాసుకొచ్చాయి.ఈ క్రమంలో శనివారం తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ కు ఆమె ఫిర్యాదు చేశారు.
"""/" /
కొన్ని యూట్యూబ్ ఛానల్స్( YouTube Channels ) తన వీడియోలతో అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ హామీ ఇచ్చారు.
మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.ఇష్టం వచ్చిన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ట్రోలర్స్ ను హెచ్చరించారు.