S. Janaki : నాకు కాకుండా ఆ గాయనికి అవార్డు వస్తే సంతోషపడేదాన్ని : ఎస్ జానకి

ప్రతిభ ఉంటే చాలదు .అందుకు తగ్గ ప్రతిఫలము దక్కాలి.

అలాంటి ప్రతిఫలం దక్కకపోతే ఎంత ప్రతిభ ఉండి మాత్రం ఏం లాభం.ఒకవేళ ఆ ప్రతిభకు పట్టాభిషేకం జరగకపోయినా కూడా ఎంతో తీరని లోటు ఉంటుంది.

ముఖ్యంగా కళా రంగంలో ప్రతిభావంతులైన ఎవరికైనా కూడా డబ్బులు కన్నా కూడా పేరు ప్రతిష్టలు ప్రాణంగా బ్రతుకుతారు.

వారి ప్రతిభను పదిమంది గుర్తించి చప్పట్లు కొట్టాలని అనుకుంటారు.అలా జరగనప్పుడు ఇండస్ట్రీ నుంచి మెల్లిగా తెరమరుగు అయిపోతూ ఉంటారు.

"""/" / అలాంటి వారిలో సింగర్ మిన్మిని( Minmini ) కూడా ఒకరు.

ఆమె పాడిన పాటనే తన పేరుగా మార్చుకున్న సింగర్ గా ఈమెకు మంచి గుర్తింపు ఉంది.

మిన్మిని తమిళ అమ్మాయి.అందుకే ఆమె తమిళ్లోనే ఎక్కువ పాటలు పాడింది.

ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం అందించిన రోజా సినిమా ( Roja Movie ) ఎంత పెద్ద మ్యూజికల్ హిట్ అనే విషయం మనందరికీ తెలిసిందే.

ఈ సినిమాతోనే తన ప్రయాణం మొదలు పెట్టింది గాయని మిన్మిని.ఈ సినిమాలో చిన్ని చిన్ని ఆశ అనే పాట పాడి యావత్ భారతదేశాన్ని తన పాట మత్తులో ముంచేసింది.

అయితే తమిళ్ లోనే కాదు ఈ సినిమా అనేక భాషల్లోకి విడుదల అయింది.

అన్ని భాషల్లోనూ ఆ పాటను మిన్మిని పడటం విశేషం.ఆ సంవత్సరం ఈ పాటకు జాతీయ అవార్డు కూడా వస్తుందని అందరూ అనుకున్నారు.

"""/" / 1993లో విడుదలైన రోజు చిత్రానికి లెక్క పెట్టలేనన్ని అవార్డ్స్ సొంతమయ్యాయి.

ఈ పాట రాసిన వైరముత్తు అలాగే కంపోజ్ చేసిన రెహమాన్ కి కూడా అవార్డు వచ్చింది.

ఈ పాట పాడిన మిన్మిని కి కూడా అవార్డు వస్తుందని అందరూ ఎదురు చూశారు కానీ ఆ ఏడాది ఉత్తమ గాయనిగా సన్నాజాజి పడక అనే క్షత్రియ పుత్రుడు లో పాట పాడిన ఎస్ జానకమ్మకి ఆ అవార్డు లభించింది.

అయితే అవార్డు దక్కడం సంతోషమే అయినా ఈ అవార్డు తనకు కాకుండా మిన్మిని కి దక్కితే బాగుండేదని అప్పుడు తన ఆనందం ఇంకా రెట్టింపయ్యెదని జానకమ్మ( S.

Janaki ) చెప్పడం కోసమెరుపు.

మెగాస్టార్ బాబీ కాంబో సినిమాకు నిర్మాత ఎవరు.. చిరంజీవి అలా చేయడం సాధ్యమేనా?