నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు.. సింగర్ హారిక సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సింగర్లలో హారిక ( Harika ) ఒకరు.

పాడుతా తీయగా కార్యక్రమం గురించి ప్రస్తుతం కొన్ని వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ప్రవస్తి( Pravasti ) చేసిన కామెంట్లు సంచలనం అవుతున్నాయి.

కొందరు ప్రవస్తిని సపోర్ట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం ప్రవస్తి గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ వివాదంకు సంబంధించి ఊహించని మలుపు చోటు చేసుకుంది.ఒక టీవీ షో డిబేట్( TV Show Debate ) లో తన వీడియోను అనుమతి లేకుండా ఉపయోగించడం విషయంలో హారిక నారాయణ్ సీరియస్ అయ్యారు.

అదే సమయంలో కీరవాణిపై వస్తున్న ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని ఆమె పేర్కొన్నారు.

వీక్షణ అనే నా ప్రైవేట్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి( Music Director Keeravani ) చేతుల మీదుగా రిలీజ్ చేశామని ఆమె తెలిపారు.

దాన్ని మేము రీల్ లా పోస్ట్ చేశామని ఆమె కామెంట్లు చేశారు. """/" / అయితే నా వీడియోను ఒక ఛానెల్ లో రాంగ్ కాంటెక్ట్స్ లో చూపించడంతో పాటు నోటికొచ్చింది మాట్లాడారని హారిక తెలిపారు.

నాకు అది నచ్చలేదని కీరవాణిఒక లెజెండరీ పర్సన్ అని ఒక చిన్న మ్యూజిక్ వీడియోని సపోర్ట్ చేయడమే గొప్ప విషయం అని ఇది ఆయన కొత్తవాళ్లను ఎలా ప్రోత్సహిస్తారో చెప్పడానికి ఒక ఉదాహరణ అని తెలిపారు.

కీరవాణి గారి దగ్గర మ్యూజిక్ తో పాటు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని హారిక పేర్కొన్నారు.

"""/" / అలాంటి వ్యక్తి గురించి నిజం తెలుసుకోకుండా అబద్దాలు చెప్పడం నాకు నచ్చలేదని ఆమె వెల్లడించారు.

కీరవాణి, సునీత, చంద్రబోస్ ఈ ఆరోపణల గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.భవిష్యత్తులో హోస్ట్ గా వ్యవహరించాలంటే సెలబ్రిటీలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

హారిక కామెంట్లపై ఎవరైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది.