పెళ్లి ఫోటోలను డిలీట్ చేసిన ప్రముఖ స్టార్ సింగర్.. డిలీట్ చేయడానికి కారణాలివేనా?

టాలీవుడ్ లో ఎంతోమంది మేల్ అలాగే ఫిమేల్ సింగర్స్ ఉన్న విషయం తెలిసిందే.

వీరందరూ కూడా ఎవరికి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.అలా ఎన్నో పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గాయని హారిక నారాయణ్( Harika Narayan ) కూడా ఒకరు.

ఈమె సర్కారు వారి పాట, వారసుడు లాంటి చిత్రాలకు సాంగ్స్ పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యి ఆమెకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి.

అయితే హారికా సోషల్ మీడియాలో చాలా తక్కువగా నిలుస్తూ ఉంటుంది. """/" / ఒకవైపు సింగర్ గా పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరిస్తూనే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక విషయంలో హారిక పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.హారిక నారాయణ్ గత ఏడాది మార్చిలో పృథ్వీనాధ్( Pridhvinath ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే పెళ్లికి రెండు వారాల ముందు నిశ్చితార్థం చేసుకున్నారు.అప్పటివరకు తను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది.

"""/" / కాగా హారిక నారాయణ్ పెళ్లికి కీరవాణి, రాఘవేంద్రరావు, యాంకర్ ప్రదీప్ తో పాటు చాలామంది సింగర్స్ హాజరయ్యారు.

సరే అసలు విషయానికొస్తే.తన ఇన్ స్టాలో పెళ్లి, ఎంగేజ్ మెంట్ ఫొటోల్ని హారిక నారాయణ్ తాజాగా డిలీట్ చేసింది.

ఈమె అకౌంట్ లో భర్త పృథ్వీతో కలిసున్న ఫొటోలు కూడా లేవు.మరోవైపు హారిక భర్త పృథ్వీ ఇన్ స్టాలోనూ పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు.

దీంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయా? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.‍అయితే హారిక,పృథ్వీ ఒకరినొకరు మాత్రం ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు.

మరేం జరిగిందో? ఏమో తెలియాలి అంటే ఈ విషయంపై వారు స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.