Geetha Madhuri : సింగర్ గీతామాధురి ఆ హీరోని రెండో పెళ్లి చేసుకోవాలనుకుందా..?
TeluguStop.com
సింగర్ గీతామాధురి ( Singer Geetha Madhuri ) అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.
ఈమె తెలుగు, తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో కలిపి దాదాపు 1600 కు పైగా పాటలు పాడి ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకుంది.
ఇక గీత మాధురి నటుడు నందు ( Nandu ) ని పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.
అయితే గత రెండు సంవత్సరాల నుండి గీత మాధురి నందు ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని,అందుకే ఏ పబ్లిక్ ఈవెంట్లో కూడా కలిసి కనిపించడం లేదని, సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు అని మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.
"""/"/
అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని నందు మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బయట పెట్టారు.
గీతా మాధురి బిగ్ బాస్ 2 ( Bigg Boss2 ) లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి రన్నరప్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే.
అయితే గీత మాధురి బిగ్ బాస్ నుండి వచ్చాక ఆమెపై కొన్ని ట్రోల్స్ వచ్చాయి.
అంతేకాదు బిగ్ బాస్ లో పెళ్లయిన గీతామాధురి నటుడు సామ్రాట్ తో క్లోజ్ గా ఉండడం, అతనితో ఎక్కువగా మాట్లాడడంతో చాలామంది ఈమె పై నెగిటివ్ కామెంట్లు చేశారు.
అంతేకాదు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే థంబ్ నెయిల్స్ సృష్టించి మరీ వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అని ఇలా రకరకాల కామెంట్లు ఈమెపై చేశారు.
అయితే ఆ మధ్యకాలంలో బిగ్ బాస్ నుండి వచ్చాక గీత మాధురి తన భర్త నందుకు విడాకులు ఇచ్చేసి సామ్రాట్ (Samrat) ని రెండో పెళ్లి చేసుకుంటుంది అని ప్రచారం జరిగింది.
""img Src=" "/
ఇక ఈ ప్రచారాన్ని ఎవరు ఖండించకపోవడంతో అందరూ నిజమే అని కూడా భావించారు.
కానీ అదే సమయంలో గీత మాధురి నందులకు ద్రాక్షాయిని అనే పాప పుట్టడంతో వీరిద్దరి మధ్య వస్తున్న వార్తలకు పులిస్టాప్ పడినట్లు అయింది.
అలా గీతామాధురి ( Geetha Madhuri ) బిగ్ బాస్ నుండి వచ్చాక చాలా నెగిటివిటీని మూటగట్టుకుంది.
కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా తనపై వస్తున్న పుకార్లు ఆగిపోయాయి.
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత… అదే నా కోరిక అంటూ?