నా పిల్లలని వారికి దూరంగా ఉంచగలను.. చిన్మయి సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈమె సింగర్ గా కంటే సోషల్ మీడియాలో, సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
కాగా సింగర్ చిన్మయి( Singer Chinmayi ) 2014లో నటుడు రాహుల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈమె తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా సింగర్ చిన్మయి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
కాగా ఒకప్పుడు మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ సౌత్‌లో అందరికీ చెమటలు పట్టించింది.
ముఖ్యంగా కోలీవుడ్( Kollywood )ను షేక్ చేసింది చిన్మయి.అందులో వైరముత్తు, సింగర్ కార్తిక్ ( Karthik )వంటి వారి భాగోతాలను నిర్భయంగా బయటకు పెట్టింది.
ఇప్పటికీ ఈ ఇద్దరితో కలిసి పని చేసేందుకు చిన్మయి నో చెబుతూనే ఉంటుంది.
పైగా ఇలా మహిళలపై అత్యాచారాలు చేసే మోలెస్టర్లకు అవకాశాలు ఎలా ఇస్తున్నారంటూ కోలీవుడ్ మీద విరుచుకు పడుతూ ఉంటుంది.
అయితే మీటూ ఉద్యమం వల్ల ఆమె కెరీర్ నాశనమైన సంగతి తెలిసిందే.కోలీవుడ్ లో ఇప్పటికీ ఆమె మీద ఇంకా బ్యాన్ కొనసాగుతోంది.
డబ్బింగ్ చెప్పుకోవడానికి వీల్లేదు. """/" /
సాంగ్స్ పాడే అవకాశాన్ని కూడా అక్కడి వాళ్లు ఇవ్వడం లేదు.
కానీ అడపదడపా అవకాశాలను లభిస్తున్నాయి.కానీ చిన్మయి మాత్రం ఎప్పుడూ కూడా తన పోరాటాన్ని ఆపలేదు.
ఎవరు చెప్పినా, ఎంత పెద్ద వాళ్లు నచ్చజెప్పినా కూడా చిన్మయి వెనక్కి తగ్గలేదు.
ఇకపోతే చిన్మయి తాజాగా తన కోలీవుడ్ సింగింగ్, మ్యూజిక్ ఫ్యామిలీ మీద కౌంటర్లు వేసింది.
మీటూ మూమెంట్ వల్ల తనకు ఎవరెలాంటి వారో తెలిసిందని, వారికి దూరంగా తన బిడ్డలను పెంచుకోవచ్చని, వారికి దూరంగా కనీసం ఐదు కిలోమీటర్ల రేడియస్‌లో బిడ్డలను ఉంచుతానని కౌంటర్లు వేసింది.
పహల్గామ్ ఉగ్రవాదుల దాడి .. కెనడా వ్యాప్తంగా ఎన్ఆర్ఐల నిరసనలు