అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ అంటూ ఆ కామాంధుడి గుట్టురట్టు చేసిన చిన్మయి!

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,సింగర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె తన కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా సమాజంలో మహిళలపై జరిగే దాడులను అన్యాయాన్ని ఎదిరిస్తూ వారికి అండగా నిలబడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా స్పందించిన చిన్మయి ఎన్నోసార్లు నెటిజన్ల చేతిలో దారుణంగా ట్రోల్ అవుతూ ఉంటుంది.

అయినా వాటి గురించి పట్టించుకోని చిన్మయి మహిళల పట్ల జరిగే అన్యాయాల గురించి తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా చిన్మయి పలు పోస్టులను షేర్ చేశారు.అయితే ఇందులో ఒక కామాంధుడు అమ్మాయిల ప్రైవేట్ గురించి అసభ్యకర పదజాలంతో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ చిన్మయి చేసిన ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఈ విషయాలను చిన్మయి తెలియజేస్తూ ఒక కామాంధుడు తన స్నేహితులతో చాటింగ్ చేస్తూ అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ అయిన వక్షోజాలను తాకడం వాడికి ఇష్టం అంటూ ఇదే విషయాన్ని తన స్నేహితుడికి చెబుతున్నట్లు ఉన్నటువంటి పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇలా రద్దీగా ఉన్న ప్రదేశాలలోను ఒంటరిగా అమ్మాయిలు తిరిగే ప్రదేశాలలో అమ్మాయిల వక్షోజాలు తాకడంలో వాడు ఎక్స్పర్ట్ అని తన గ్యాంగ్లో తనే గ్రేట్ అంటూ చెప్పుకొన్నాడు.

ఈ క్రమంలోనే చిన్మయి ఈ పోస్టులను షేర్ చేస్తూ సమాజంలో మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించే ఇలాంటి నీచులు కూడా ఉన్నారు.

వాడి సరదా కోసం అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ఎంజాయ్ చేస్తున్నాడని ఈ సందర్భంగా చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రూ.10 విషయంలో ఆటోడ్రైవర్‌ను చితకబాదిన ట్రాన్స్‌జెండర్ ఉమెన్.. వీడియో వైరల్..