ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్‌ చిన్మయి

మీటూ ఉద్యమం సమయంలో సింగర్‌ చిన్మయి చాలా అగ్రసివ్‌గా తమిళ రచయిత వైరముత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చినా కూడా వాటిన పట్టించుకోకుండా తాను ఏదైతే అనుకుంటే దాన్ని మాట్లాడింది.

వైరముత్తు వల్ల ఎంతో మంది అమ్మాయిలు ఇబ్బంది పడ్డారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

వైరముత్తు జీవితంలో అనేక అమ్మాయిలను లైంగికంగా వేదించాడని మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

మీటూ ఉద్యమంలో చిన్మయి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది.వైరముత్తు పై వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు.

ఇక ఆమె ను అనధికారికంగా తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి బహిష్కరించారు.ప్రతి ఒక్కరు కూడా ఆమెపై అసంతృప్తితో ఉన్నారు.

తాజాగా ఆమె మోడీపై అసంతృప్తి వ్యక్తం చేసింది.మోడీ ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ మీటూ ఉద్యమం గురించి ఎగతాళి చేసినట్లుగా మాట్లాడటం ఆమెకు తీవ్ర మనోవేదనకు గురి చేసిందట.

"""/"/ తాజాగా ఒక మీటింగ్‌లో మోడీ మాట్లాడుతూ మా ప్రభుత్వం చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను తప్పుబట్టిన కాంగ్రెస్‌ పార్టీ అప్పట్లో మేము కూడా మూడు నాలుగు సార్లు అలా చేశాం అంటూ గొప్పలు చెప్పుకునేందుకు మీటూ మీటూ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ ఎద్దేవ చేశాడు.

కాంగ్రెస్‌ వారి తీరు ఆడవారి మాటల తీరుగా ఉందన్నట్లుగా మోడీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

దాంతో మోడీ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మోడీ తీరు ఏమాత్రం బాగాలేదు అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆయన మాట్లాడిన మాటల వీడియోను విడుదల చేసింది.ఇది సరైనది కాదు అంటూ మోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.

ఏపీ కొత్త డీజీపీ ఎంపిక.. సాయంత్రం ఈసీ ప్రకటన..!!