సింగపూర్ : జాతీయ స్మారకంగా నేతాజీ ఢిల్లీ చలో నినాదమిచ్చిన మైదానం

సింగపూర్ ప్రభుత్వం మంగళవారం తన 200 ఏళ్ల ఐకానిక్ గ్రీన్ ఓపెన్ స్పేస్ పడాంగ్‌ను చారిత్రక ప్రదేశంగా ప్రకటించింది.

అంతేకాదు.ఈ ప్రదేశంతో భారతదేశానికి ప్రత్యేకమైన అనుబంధం కూడా వుంది.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ఢిల్లీ చలో నినాదాన్ని ఇక్కడే ఇచ్చారు.

ఈ పడాంగ్‌ను 75వ జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించారు.సింగపూర్ మంగళవారం 57వ జాతీయ స్మారక దినోత్సవాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే.

సింగపూర్ సివిల్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున వున్న 4.3 హెక్టార్ల పడాంగ్ సింగపూర్ జాతీయ స్మారక చిహ్నాల జాబితాలో మొదటి గ్రీన్ ఓపెన్ స్పేస్.

ఈ పెద్ద మైదానం క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, లాన్ బౌలింగ్ వంటి క్రీడలకు ప్రసిద్ధి.

1800 నాటి నుంచి ఇది వాడుకలో వుంది.57వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్, స్థానిక సంస్కృతి, పాఠశాలలు, పౌర సమూహాల నృత్యరీతులను ప్రదర్శించారు.

ఇకపోతే.పడాంగ్ స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం కింద సింగపూర్‌లో అత్యున్నత స్థాయి రక్షణను పొందిందని నేషనల్ హెరిటేజ్ బోర్డ్ తెలిపింది.

"""/"/ పడాంగ్ అంటే మలయ్‌లో ‘ఫీల్డ్’అని అర్ధం.వలస రాజ్యాల కాలంలో ప్రజలకు అందుబాటులో వున్న కొద్దిపాటి బహిరంగ ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో సౌత్ ఏషియన్ స్టడీస్ హెడ్ ప్రొఫెసర్ రాజేష్ రాయ్.

ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ)తో పడాంగ్‌కు వున్న సంబంధాన్ని పునరుద్ఘాటించారు .బ్రిటీష్ వారు ఈ ద్వీపంలో తమ ఔట్‌పోస్ట్‌ను స్థాపించినప్పుడు భారతీయ సిపాయిలు తొలుత తమ క్యాంప్ సైట్‌లను ఇక్కడే నెలకొల్పారని రాజేశ్ అన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ దాదాపు పదివేల మంది ఐఎన్ఏ సైనికులకు , స్థానిక భారతీయ జనాభాను ఉద్దేశించి అనేక ప్రసంగాలు చేసిన ప్రదేశం కూడా ఇదే.

ఇక్కడే ఆయన ‘ఢిల్లీ చలో’ నినాదాన్ని ఇచ్చారు.రాణి ఆఫ్ ఝూన్సీ రెజిమెంట్‌ను స్థాపించి.

భారతదేశాన్ని బ్రిటీష్ పాలన నుంచి విముక్తి చేయడానికి భారతీయ వనరుల మొత్తాన్ని సమీకరించాలని బోస్,పిలుపునిచ్చారు.

యుద్ధం ముగియడానికి ముందు బోస్.పడాంగ్ దక్షిణపు అంచున ఐఎన్ఏ స్మారకాన్ని స్థాపించారని రాజేశ్ తెలిపారు.

ఇకపోతే.సెప్టెంబర్ 12, 1945న జపాన్ లొంగుబాటును పురస్కరించుకుని విజయ్ పరేడ్ కూడా పడాంగ్‌లో జరిగింది.

అప్పటి నుంచి ఈ మైదానం సింగపూర్ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.

వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఇలా చేస్తే సహజంగానే నల్లటి కురులు మీ సొంతమవుతాయి!