సింగపూర్ : దిగ్గజ హాకీ ప్లేయర్ అజిత్ సింగ్ గిల్ కన్నుమూత .. శోకసంద్రంలో క్రీడా ప్రపంచం

సింగపూర్‌కు( Singapore ) చెందిన అత్యంత వృద్ధ ఒలింపియన్, భారత సంతతికి చెందిన మాజీ జాతీయ హాకీ ఆటగాడు అజిత్ సింగ్ గిల్( Ajit Singh Gill ) కన్నుమూశారు.

ఆయన వయసు 95 సంవత్సరాలు.మూత్రపిండాల వైఫల్యంతో గిల్ ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా నివేదిక పేర్కొంది.

1956 మెల్‌బోర్న్ గేమ్స్‌లో( Melbourne Games ) పాల్గొన్న గిల్‌కు 92 ఏళ్ల భార్య సుర్జిత్ కౌర్ , ఐదుగురు పిల్లలు, 10 మంది మనవళ్లు, ఐదుగురు మనవరాళ్లు వున్నట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.

గిల్ మరణం పట్ల దేశంలోని క్రీడలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"""/" / అతని పెద్ద కుమారుడు డాక్టర్ మెల్ గిల్ ( Dr.

Mel Gill )మాట్లాడుతూ.గతేడాది ఫిబ్రవరిలో అజిత్ సింగ్ కిందపడిపోవడంతో ఆయన తుంటి ఎముక విరిగిపోయిందని చెప్పారు.

మూడు నెలల్లోనే కోలుకున్నప్పటికీ , మూత్ర పిండాల వైఫల్యం కారణంగా అజిత్ సింగ్ ఆరోగ్యం క్షీణించిందని గిల్ పేర్కొన్నారు.

సింగపూర్ నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గ్రేస్ ఫూ( Grace Fu ) మాట్లాడుతూ.

గిల్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.అజిత్ సింగ్ ఆ కాలంలో అత్యుత్తమ క్రీడాకారుడని, క్రీడా జీవితం తర్వాత సింగపూర్‌లో క్రీడల అభివృద్ధికి కృషి చేశారని గ్రేస్ ప్రశంసించారు.

"""/" / 1956 ఒలింపిక్స్‌లో సింగపూర్ తరపున ప్రాతినిధ్యం వహించిన సభ్యులలో జీవించి వున్న వారిలో గిల్ ఒకరని సింగపూర్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మాథవన్ దేవదాస్ అన్నారు.

పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉన్నప్పటి నుంచి తనకు 50 ఏళ్లుగా గిల్‌తో పరిచయం వుందని చెప్పారు.

గిల్ ఒక ఐకానిక్ ఫిగర్ అని.90 ఏళ్ల వయసులోనూ అజిత్ సింగ్ ఎంతో చురుగ్గా వుండేవారని మాథవన్ గుర్తుచేసుకున్నారు.

ఇప్పటికీ గోల్ఫ్ ఆడేవారని, ఈవెంట్‌లకు రావడానికి, ఆటగాళ్లతో ముచ్చటించేందుకు , తన అనుభవాలను వారితో పంచుకునేందుకు వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అజిత్ ఎప్పుడూ ముందుండేవారని ఆయన ప్రశంసించారు.

నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్