భారతీయ విద్యారంగంలో భారీ పెట్టుబడులు పెట్టనున్న ఎన్ఆర్ఐ ఫౌండేషన్..!!
TeluguStop.com
సింగపూర్‌లోని భారత సంతతికి చెందిన గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్ (జీఎస్ఎఫ్) 2026 నాటికి భారతదేశంలోని పాఠశాల విద్యా రంగంలో 550 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, నోయిడాలలో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తోంది జీఎస్ఎఫ్.విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే కుటుంబాలు.
భారత్‌లోని నగరాల్లో వున్న స్వదేశీ కమ్యూనిటీలపై ఫోకస్ పెట్టింది.జీఎస్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ , కో ఫౌండర్ అతుల్ టెముర్నికర్ మాట్లాడుతూ.
భారత్‌ను తమ వ్యూహాత్మక వృద్ధి మార్కెట్‌లలో ఒకటిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఉత్తర ఆసియా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, యూరప్, యూకే, యూఎస్ఏ వంటి అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ఇప్పటికే పలు స్టూడెంట్ కమ్యూనిటీలు ప్రధాన భారతీయ మెట్రోపాలిటన్ నగరాలకు మకాం మార్చుతున్నాయని అతుల్ తెలిపారు.
ఇకపోతే.జీఎస్ఎఫ్ తన అంతర్జాతీయ పాఠ్యాంశాలను అందించే క్యాంపస్‌లను విస్తరణ, విలీనం, కొనుగోళ్లు ద్వారా బెంగళూరు, హైదరాబాద్, ముంబై, మధురై, నాగ్‌పూర్, నోయిడా వంటి నగరాల్లోకి విస్తరించాలని యోచిస్తోంది.
అంతర్జాతీయ కమ్యూనిటీలకు అనుగుణంగా నగరంలో మరిన్ని అంతర్జాతీయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నోయిడా అధికారులు గ్లోబల్ చైన్ ఆఫ్ స్కూల్‌లను ఆహ్వానించారు.
"""/"/
ఈ నేపథ్యంలో సింగపూర్ వాణిజ్య మంత్రిత్వ శాఖ మద్ధతుతో జీఎస్ఎఫ్.నోయిడా యంత్రాంగంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
దీని ప్రకారం జాతీయ స్థాయి విద్యా మండలితో పాటు అంతర్జాతీయ పాఠశాలల కోసం రూ.
100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి జీఎస్ఎఫ్ కట్టుబడి వుంది.నోయిడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రీతూ మహేశ్వరి , జీఎస్ఎఫ్ డిప్యూటీ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రఫుల్ల రౌత్‌లు ఈ ఎంవోయూపై సంతకం చేశారు.
జీఎస్ఎఫ్ యూరప్, జపాన్, మిడిల్ ఈస్ట్, భారత్ వ్యాప్తంగా మరిన్ని కమ్యూనిటీలకు సేవలను అందించాలని జీఎస్ఎఫ్ భావిస్తోంది.
ఈ ఫౌండేషన్ 11 దేశాలలో 35 క్యాంపస్‌ల నెట్‌వర్క్‌ను కలిగి వుంది.70 దేశాలకు చెందిన 32000 మంది విద్యార్ధులకు ఈ సంస్థ విద్యను అందిస్తుంది.
చిరంజీవి పెదనాన్న మా ఫ్యామిలీకి హెడ్ మాస్టర్… వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!