ప్రపంచంలో సేఫెస్ట్ ప్లేస్ సింగపూర్... వరస్ట్ ప్లేస్ ఆప్ఘనిస్తాన్.. భారత్ ర్యాంకెంతో తెలుసా?
TeluguStop.com
మనిషి సంచార జీవి.బతకడం కోసం ఎక్కడికైనా ప్రయాణిస్తాడు.
ఈ క్రమంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొని మందికి సాగిపోతూ ఉంటాడు.ఇది అనాదిగా వస్తోంది.
ఆదిమానవుడి నుండి ఇది ఆరంభం అయింది.అయితే నేటి స్మార్ట్ యుగంలో మనిషి అన్నవాడు ఎక్కడికి వెళితే తన జీవితం బావుంటుందో ముందే తెలుసుకొని పయనించే వెసులుబాటు కలదు.
అలాగే ఎక్కడకి వెళితే బాగా సంపాదించొచ్చు, ఎక్కడకి వెళితే బాగా ఆరోగ్యంగా ఉంటాం, ఎక్కడకి వెళితే క్షేమంగా ఉండొచ్చు అనే విషయాలు నేడు మనకి యిట్టె సర్వేల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం.
ఇలా రకరకాల విషయాలను బేరేజివేసి సురక్షిత దేశాల లిస్టు అనేది తాజాగా వెలువడింది.
అవును, గ్లోబల్ అనలిటిక్స్ అనే కంపెనీ తన నివేదికలో 2022 తూర్పు ఆసియాను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఖండంగా పేర్కొంది.
ఈ జాబితాలో అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ ఫస్ట్ ప్లేసుని సంపాదించుకుంది.అలాగే ఈ లిస్టులో అత్యంత వరస్ట్ దేశంగా ఆప్ఘనిస్తాన్ చివరి స్ధానంలో ఉండటం కొసమెరుపు.
అయితే ఈ లిస్టులో భారత్ సహా పలు దేశాలకూ నిరాశ తప్పలేదు.గ్యాలప్ అధ్యయనంలో భారత్.
బ్రిటన్, బంగ్లాదేశ్‌ల కంటే కూడా వెనకబడి 60వ స్థానంతో సరిపెట్టుకుంది. """/"/
అయితే ఈ జాబితాలో ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ 48వ స్థానంలో ఉండటం కాస్త ఫన్నీ విషయం.
అంటే పాకిస్థాన్ భారత్ కంటే సురక్షిత దేశంగా గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈ విషయాన్ని నెటిజన్లు మాత్రం అంగీకరించడంలేదు.
ఆ సంగతి పక్కనబెడితే ఈ అధ్యయనంలో గత 3 సంవత్సరాలుగా ఆప్ఘనిస్తాన్ చివరి స్ధానంలోనే కొనసాగడం గమనార్హం.
తాలిబన్ల పాలన రాకముందు నుంచే ఆప్ఘన్ లో సాగుతున్న అంతర్యుద్ధ పరిస్ధితులు, శాంతిభద్రతల్ని దారుణంగా ఆదేశ గ్రాఫ్ ని పడేశాయి.
దీంతో ఆప్ఘన్ కు చివరి స్ధానం తప్పడం లేదు.మరోవైపు సింగపూర్ మాత్రం ఎప్పటిలాగే ఈ అధ్యయనంలో 96 పాయింట్లు సాధించి అత్యంత సురక్షిత దేశంగా తొలి ర్యాంకులో కొనసాగడం విశేషం.
షాకింగ్: అడుక్కునే వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఎలా కొన్నాడో వినండి?