విదేశీయులకు శుభవార్త: ఆంక్షలు సడలిస్తున్న సింగపూర్.. కానీ ఒక షరతు

కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలన్నీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.వైరస్ వ్యాప్తి తగ్గినా, తగ్గకున్నా.

కొన్ని రోజుల తర్వాతైనా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల్సిందే.లేదంటే దేశాల ఆర్ధిక వ్యవస్ధలు కుప్పకూలిపోతాయి.

ఇప్పటికే దీని ప్రభావం అగ్రరాజ్యం అమెరికా సహా కొన్ని దేశాల్లో కనిపిస్తోంది.పరిస్ధితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నెట్టుకురావడం కష్టమని భావిస్తున్న ఆయా దేశాలు ఆర్ధిక వ్యవస్ధలను తిరిగి గాడిన పెట్టే పనిలో పడ్డాయి.

ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తూ కునారిల్లుతున్న ఆర్ధిక వ్యవస్థలకు జవసత్వాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఆర్ధిక వ్యవస్ధకు ఇది మేలు చేసే విషయమే అయినా ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలో కరోనా కేసులు పెరగటానికి ప్రధాన కారణంగా భావిస్తున్న విదేశీ కార్మికులపై విధించిన ఆంక్షలపై సడలింపులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడైన తర్వాతే పనిలోకి చేరేందుకు అవకాశం కల్పిస్తామని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

దీనిపై ఆ దేశ మంత్రి జోసఫిన్ టియో మాట్లాడుతూ.తమ దేశంలో విదేశీ కార్మికులందరికీ విస్తృతంగా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

జూన్ నుంచి వారిపై ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తామని టియో వెల్లడించారు. """/"/ కాగా ఆంక్షల సడలింపులతో కొన్ని దేశాల్లో కరోనా మళ్లీ విరుచుకుపడుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తొలుత కోవిడ్ 19 కట్టడికి గట్టి చర్యలు తీసుకుని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన సింగపూర్‌లో ఏప్రిల్ 7 నుంచి మే 7 వరకు ఆ దేశ ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది.

పని ప్రదేశాలు, పాఠశాలలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.

దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం జూన్ 1 వరకు విద్యాసంస్థలు, పరిశ్రమలు మూసివేయాలని నిర్ణయించింది.

దెందులూరు ఎమ్మెల్యే పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!