పాలస్తీనాకు సపోర్ట్ .. సింగపూర్‌లో అభియోగాలు, కేరళ వెళ్తానంటూ కోర్టుకెక్కిన భారత సంతతి మహిళ

ఇజ్రాయెల్ - హమాస్( Israel–Hamas War ) యుద్ధం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.

ఈ ఘర్షణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఇజ్రాయెల్, పాలస్తీనా అనుకూల నిరసనలు జరుగుతున్నాయి.

ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా (America )ఈ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.అక్కడి విద్యాసంస్థల్లో విద్యార్ధులు రెండు వర్గాలుగా చీలిపోయి ఆందోళనలు నిర్వహిస్తుండటంతో శాంతి భద్రతల సమస్యలు చోటు చేసుకుంటున్నాయి.

భారతదేశంలోనూ అక్కడక్కడా ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి.ఇదిలావుండగా .

అనుమతి లేకుండా పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహించినట్లుగా అభియోగాలు మోపబడిన భారత సంతతికి చెందిన మహిళ విషయంలో సింగపూర్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

కేరళ( Kerala )లోని తన తాతలను సందర్శించేందుకు వీలుగా భారత్‌కు వెళ్లేందుకు ఆమెను న్యాయస్థానం అనుమతించింది.

ఆమెను 35 ఏళ్ల అన్నామలై కోకిల పార్వతి( Annamalai Parvathi )గా గుర్తించారు.

ఈమె అనుమతి లేకుండా పాలస్తీనాకు మద్ధతునిచ్చేందుకు ఫిబ్రవరిలో మరో ఇద్దరితో కలిసి ఊరేగింపు నిర్వహించింది.

సింగపూర్ చట్టాల ప్రకారం అలాంటి ఊరేగింపు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి.

"""/" / ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న పార్వతి.కేరళలో ఉన్న తన తాతయ్యలను సందర్శించేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది.

ఈ నేపథ్యంలో 10 వేల సింగపూర్ డాలర్ల బెయిల్ మంజూరు చేస్తూనే అనేక అదనపు షరతులు విధిస్తూ పార్వతికి కీలక సూచనలు చేశారు న్యాయమూర్తి.

పార్వతి మరో ఇద్దరిపై జూన్ 27న పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ కింద నిషేధిత ప్రాంతంలో బహిరంగ ఊరేగింపు నిర్వహించేందుకు సహకరించినట్లుగా అభియోగాలు మోపారు.

"""/" / సింగపూర్‌ ప్రభుత్వం నిరసనలను ఏమాత్రం సహించదు.ఇతర దేశాల అంతర్గత విషయాలను సమర్ధించే బహిరంగ ప్రదర్శనలు అక్కడ అనుమతించబడవు.

ఇక్కడ గణనీయమైన ముస్లిం జనాభాను కలిగి ఉండటంతో పాటు ఇజ్రాయెల్‌తోనూ సింగపూర్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో గాజా వివాదం ఆ దేశానికి సున్నితమైన సమస్యగా మారింది.

పౌరులు ఈ సమస్యపై నిరసనలు చేయవద్దని అధికారులు కోరినప్పటికీ కొంతమంది సింగపూర్ వాసులు, ప్రత్యేకించి యువకులు తమ అభిప్రాయాలను ఆన్‌లైన్‌లో వ్యక్తం చేయాలనుకుంటున్నారు.

అఖండ2 సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా.. అలా ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ కు పూనకాలే!