సింగపూర్ : భారత సంతతి సిక్కు జంట సాహసం.. మూడేళ్లు శ్రమించి గురునానక్‌‌పై డాక్యుసిరీస్‌

సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌పై సింగపూర్‌కు చెందిన భారత సంతతి సిక్కు జంట భక్తిని చాటుకుంది.

ఆయన జీవిత కాలంలో సందర్శించిన పవిత్ర స్థలాలను, వాటి చరిత్రను వివరించేలా 24 ఎపిసోడ్ల డాక్యుమెంటరీని రూపొందించారు.

అమర్‌దీప్ సింగ్ ఆయన సతీమణి వినీందర్ కౌర్‌లు ఈ కార్యానికి శ్రీకారం చుట్టారు.

TheGuruNanak!--com వెబ్‌సైట్‌లో గతేడాది సెప్టెంబర్‌లో దీనిని రిలీజ్ చేశారు.ఎవరైనా సరే దీనిని ఉచితంగా వీక్షించడంతో పాటు అవసరమైన వారు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చని అమర్‌దీప్ సింగ్ గతేడాది ప్రకటించారు.

తదుపరి దశలో 'Lost Heritage Productions' 'SikhLens Productions'‌లు నిర్మించిన ఈ డాక్యుమెంటరీలను పంజాబీలు, హిందీలలోకి అనువదించి రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు.

దీనిలో భాగంగా పంజాబీ వెర్షన్‌కు సంబంధించిన డాక్యుసిరీస్‌లను శుక్రవారం అమృత్‌సర్‌లోని ఖల్సా కాలేజీలో మహిళల కోసం ప్రారంభించారు.

గురునానక్ యాత్రలకు సంబంధించి తొలుత ఇంగ్లీష్‌లో ఒక పుస్తకాన్ని కూడా సంకలనం చేసిన ఈ దంపతులు తర్వాత పంజాబీ, హిందీ తదితర భాషల్లోకి సైతం అనువదించారు.

ఇంగ్లీష్ వెర్షన్‌కి An Allegory — A Tapestry Of Guru Nanak’s Travels’, అని పేరు పెట్టగా.

పంజాబీ వెర్షన్‌కి ‘Sainat-Guru Nanak Dey Paindeyan Di Roohani Chaap’ అని నామకరణం చేశారు.

దాదాపు 550 సంవత్సరాల క్రితం గురునానక్ ‘‘సృష్టిలో ఏకత్వం ’’ అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి 22 ఏళ్ల పాటు యాత్రలు చేశారు.

ఈ క్రమంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టిబెట్, బంగ్లాదేశ్, భారత్‌, శ్రీలంక వంటి దేశాలలో పర్యటించారు.

21వ శతాబ్ధంలో దేశాల మధ్య భౌగోళిక , రాజకీయ ఆంక్షల కారణంగా గురునానక్ సందర్శించిన ప్రదేశాలను గుర్తించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఆయన పర్యటించిన ప్రాంతంలో దాదాపు 70 శాతం ప్రదేశాలను చిత్రీకరించడం కూడా కష్టమే.

ఈ నేపథ్యంలో 2019 జనవరిలో అమర్‌దీప్ సింగ్, వినీందర్ కౌర్‌ల నాయకత్వంలోని బృందం గురునానక్‌ అడుగుజాడలను గుర్తించేందుకు ప్రయాణం ప్రారంభించింది.

వ్యక్తిగత లక్ష్యానికి మించినదే అయినా గురునానక్ బోధనలను కాపాడాలనే అభిరుచితో ప్రయాణం సాగించినట్లు అమర్‌దీప్ చెప్పారు.

ఈ కార్యానికి పురాతన ‘‘జనంసాఖీల’’ (గురునానక్ జీవిత చరిత్రలు) ఎంతగానో తోడ్పడిందని చెప్పారు.

దీని ఆధారంగా వీరి బృందం దాదాపు మూడు సంవత్సరాల పాటు గురునానక్ సందర్శించిన అన్ని ప్రదేశాలను చిత్రీకరించి 24 ఎపిసోడ్‌లతో డాక్యుమెంటరీని రూపొందించింది.

"""/" / ప్రతికూల వాతావరణాలు ఎదురైనప్పటికీ.సౌదీ అరేబియాలోని మక్కా ఎడారుల నుంచి టిబెట్‌లోని కైలాష్ పర్వతం వరకు ప్రయాణించారు.

ఆఫ్ఘనిస్తాన్‌లోని మారుమూల ప్రాంతాలను, ఇరాక్‌లో తీవ్రమైన వేడిని, పాకిస్తాన్‌లోని బలూచి పర్వతాలను అధిరోహించారని అమర్‌దీప్ చెప్పారు.

అలాగే హిందూ మహాసముద్రంలోని జలాల మీదుగా ప్రయాణించి శ్రీలంకకు, ఇరాన్‌లోని పర్షియన్ సంస్కృతితో మిళితమై, బంగ్లాదేశ్‌లోని డెల్టా ప్రాంతాన్ని దాటి భారతదేశంలోని నాలుగు దిక్కులను మ్యాప్ చేసినట్లు అమర్‌దీప్ వెల్లడించారు.

మెగా హీరోలకు వరుస ఫ్లాపుల వెనుక కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరుగుతోందా?