జిల్లాలో నిషేధిత గుడుంబా స్థావరాలపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో అక్రమ గుడుంబా తయారి స్థావరాలపై గురువారం రోజున ఉదయం పోలీస్ అధికారులు( Police Officers), సిబ్బంది ప్రత్యేక టీమ్ లు గా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించగా పట్టుబడిన133 లీటర్ల జాగిరి నేలమట్టం చేయడం జరిగింది.

27 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని 17 కేసులలో 19 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

కేసు నమోదు కాబడిన వారి వివరాలు 1.భాస్కర్ నాయక్, పెద్దూర్ సిరిసిల్ల .

2 .లకావత్ దేవయ్య .

సేవాలాల్ తండా .3.

బాధవత్ మాలి మొఱ్ఱపూర్ .4.

గుగులోతు మహేష్ .నూకల మర్రి .

5.భూక్యా రమేష్, కిస్టునాయక్ తండా .

6.బాధవత్ లత ,బుగ్గ రాజేశ్వర తండా .

7.భూక్యా తిరుపతి రంగంపేట 8 భూక్యా నరహరి రంగంపేట 9.

భూక్యా అనసూయ , రంగంపేట 10.మాలోత్ జావర్లల్ రంగంపేట్ 11.

మాలోత్ నీలా , రంగంపేట్ 12.భూక్యా దేవవ్వ,లింగన్నపేట తండా .

13.భూక్యా బుజ్జి లింగన్నపేట .

14.భూక్యా రాములు, లింగన్నపేట .

15.భూక్యా చంద్రకళ సముద్రాలింగపూర్ తండా .

16.భూక్యా నగేష్ S/o.

అడ్డబోరు తండా .17.

గుంజే రాధా రుద్రంగి .18.

ఇస్లావత్ వర్జియా నిమ్మపల్లి 19.ఇస్లావత్ మధుకర్ నిమ్మపల్లి .

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.ప్రభుత్వ నిషేధిత నాటుసారా తయారు చేయడమనేది చట్ట వ్యతిరేకమైన చర్య, గుడుంబా తాగడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం అని, అది తయారు చేసే విధానం నిబంధనలకు పూర్తి విరుద్ధమని అందులో ఆరోగ్యానికి హాని చేసే యూరియా, మురికి నీరు పటిక బెల్లం వాడడం వలన ఆరోగ్యానికి విపరీతమైన హాని చేస్తుందని , తాగే వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు.

కానీ కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం పాలసీకి వ్యతిరేకంగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో రహస్యంగా ఇండ్ల వద్ద,పంట పొలాల వద్ద,అటవీ ప్రాంతంలలో కలుషిత నాటుసారా తయారు చేస్తూ విచ్చలవిడిగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారనీ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియ చేశారు.

ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని త్వరలో వారిని కూడా పట్టుకొని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అమెరికాలో హై-టెక్ మోసం.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం..