ఈ మూడు చిట్కాల‌ను పాటిస్తే కిడ్నీ స్టోన్స్‌ను సుల‌భంగా కరిగించుకోవ‌చ్చు!

కిడ్నీ స్టోన్స్‌.ప్ర‌స్తుత రోజుల్లో ఎంద‌రినో తీవ్రంగా వేధిస్తున్న స‌మ‌స్య ఇది.

పెద్ద‌లే కాదు పిల్ల‌ల్లో సైతం ఈ స‌మ‌స్య క‌నిపిస్తోంది.ఆహార‌పు అలవాట్లు, డీహైడ్రేష‌న్‌, మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవ‌డం, జీవ‌న శైలిలో మార్పులు, శ‌రీరానికి శ్ర‌మ లేక పోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి.

కొంద‌రికి వంశ పారంపర్యంగా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి.కార‌ణం ఏదైనా వాటిని నివారించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే మూడు చిట్కాల‌ను పాటిస్తే సుల‌భంగా మూత్ర పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.సెలరీ ఆకులు కిడ్నీ స్టోన్స్‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఈ ఆకుల‌తో త‌యారు చేసిన జ్యూస్‌ను త‌ర‌చూ తీసుకోవాలి.త‌ద్వారా సెల‌రీ ఆకుల్లో ఉండే ప‌లు ప్ర‌త్యేకమైన పోష‌కాలు కిడ్నీల్లో ఏర్ప‌డిన రాళ్లను క్ర‌మంగా క‌రిగించేస్తాయి.

పైగా సెల‌రీ ఆకుల జ్యూస్ త‌ర‌చూ తీసుకుంటే శ‌రీరానికి బోలెడ‌న్ని పోష‌కాలూ ల‌భిస్తాయి.

"""/"/ అలాగే తులసి ఆకుల‌తో కూడా మాత్ర‌పిండాల్లో ఏర్ప‌డ్డ స్టోన్స్‌ను నివారించుకోవ‌చ్చు.కొన్ని తుల‌సి ఆకుల‌ను తీసుకుని ఎండలో ఎండ‌బెట్టుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఈ పొడిని ఒక గ్లాస్ వాట‌ర్‌లో క‌లిపి సేవించాలి.ఇలా రోజుకు ఒక సారి చేయ‌డం వ‌ల్ల కిడ్నీలో రాళ్లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

రాజ్మా సైతం కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య నుంచి విముక్తిని క‌లిగించ‌గ‌ల‌వు.ముఖ్యంగా త‌ర‌చూ రాజ్మాతో సూప్‌ను త‌యారు చేసుకుని తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే రాజ్మా సూప్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ర‌క్త హీన‌త దూరం అవుతుంది.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మ‌రియు ఎముక‌లు దృఢంగా కూడా మార‌తాయి.

ఈ తెలుగు సాంగ్స్ ఎవరు పాడారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..