హెయిర్ బ్రేకేజ్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
TeluguStop.com
హెయిర్ బ్రేకేజ్ లేదా జుట్టు విరిగిపోవడం.చాలా మందిని బాధపెట్టే సమస్య ఇది.
పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను వాడటం, తరచూ హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను వినియోగించడం, తడి జుట్టును దువ్వడం వంటి రకరకాల కారణాల వల్ల జుట్టు ముక్కలైపోతుంటుంది.
దాంతో ఈ సమస్యను ఎలా నివారించుకోవాలో తెలియక తెగ సతమతం అయిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే చాలా సులభంగా హెయిర్ బ్రేకేజ్‌కు అడ్డుకట్ట వేయవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మూడు చుక్కలు శాండిల్‌వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ ఆయిల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి నైట్ అంతా వదిలేయాలి.
నెక్స్ట్ డే మార్నింగ్‌కు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే హెయిర్ బ్రేకేజ్ సమస్య క్రమంగా దూరం అవుతుంది.
"""/"/
అలాగే ఒక బౌల్‌లో రెండు ఎగ్ వైట్స్, వన్ టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.రెండు గంటల అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో ఒక్కసారి ఈ ప్యాక్ వేసుకుంటే జుట్టు విరగడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
"""/"/
ఇక కలబంద ఆకు నుంచి జెల్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్‌కు రెండు టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు కలిపి జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.
గంట లేదా రెండు గంటలు ప్యాక్ ఉంచుకుని.అప్పుడు మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
తేజ సజ్జ బాటలోనే నడుస్తున్న విశ్వక్ సేన్…