కడుపుబ్బరం మిమ్మల్ని వదలట్లేదా..? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
TeluguStop.com
కడుపు ఉబ్బరం.ఎప్పుడో ఒకసారి వస్తే పెద్ద ఇబ్బందేమి ఉండదు.
కానీ, కొందరిని మాత్రం తరచూ ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది.ఏం తిన్నా, తాగినా క్షణాల్లో కడుపు ఉబ్బరంగా మారిపోతుంటుంది.
తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, పేగుల్లో వాపు, మద్యపానం, ధూమపానం, కడుపులో కొవ్వు పేరుకుపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఫైబర్ ఫుడ్ తక్కువగా లేదా ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాల వల్ల కడుపు ఉబ్బరానికి గురవుతుంటారు.
కారణం ఏదైనా తరచూ కడుపు ఉబ్బరాన్ని ఎదుర్కోవడం ఎంతో కష్టంతో మరియు అసౌకర్యంతో కూడుకున్న పని.
అందుకే అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలు తీసుకుంటే.మళ్లీ జీవితంలో ఆ సమస్య మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండి.కడుపు ఉబ్బరం సమస్యను వదిలించడంలో కొన్ని కొన్ని పండ్లు అద్భుతంగా సహాయపడతాయి.
అలాంటి వాటిల్లో కివి, అరటి, నారింజ, పైనాపిల్ పండ్లు ముందు వరసలో ఉన్నాయి.
కాబట్టి, ప్రతి రోజు ఈ పండ్లలో ఏదో ఒకదాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. """/" /
అలాగే ఒక కీరదోస, ఒక యాపిల్ లను తీసుకుని రసం తయారు చేసుకోవాలి.
ఆపై ఆ రసంలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం, ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే.
కడుపులో పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాదు వ్యర్థాలు, విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.దాంతో కడుపు ఉబ్బరానికి గురికాకుండా ఉంటారు.
గ్రీన్ టీ, గుమ్మడి, సోంపు, మిరియాలు, పెరుగు వంటి వాటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.
మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోవాలి.రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి.
ఒకే సారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోరాదు.భోజనం చేసేటప్పుడు నీటిని తాగకూడదు.
చక్కెర, ఉప్పులను ఎవైడ్ చేయాలి.శరీరానికి సరిపడా నీటిని అందించాలి.
ఒత్తిడిని తగ్గించుకోవాలి.మరియు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కడుపు ఉబ్బరమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు సమర్థవంతంగా రక్షించుకోవచ్చు.
ఎట్టకేలకు కాబోయే భర్త ఫోటో షేర్ చేసిన నటి… ఫోటో వైరల్!