నాజూకైన నడుము కోసం సింపుల్ టిప్స్.. డైట్ కూడా అక్క‌ర్లేదు!

నాజూకైన న‌డుము కావాల‌ని ప్ర‌తి స్త్రీ కోరుకుంటుంది.అయితే ఆహార‌పు అల‌వాట్లు, కంప్యూట‌ర్ల ముందు గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ప‌ని చేయ‌డం, ప్రెగ్నెన్సీ, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతుంటుంది.

దాంతో కొవ్వును క‌రిగించుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.క‌ఠిన‌మైన డైట్‌ను ఫాలో అవుతుంటారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే సుల‌భంగా నాజూకైన న‌డుమును పొందొచ్చు.

పైగా ఎటువంటి డైట్‌ను కూడా పాటించాల్సిన అవ‌స‌రం లేదు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

సాధార‌ణంగా కొంద‌రు ఆక‌లి వేసిన‌ప్పుడు స్వీట్స్‌, చిప్స్‌, బిస్కట్స్ వంటివి స్నాక్స్‌గా తింటుంటారు.

అయితే ఇకపై మాత్రం న‌ట్స్‌, ఉడికించిన శెన‌గ‌లు, గుమ్మ‌డి గింజ‌లు, తాజా పండ్లు వంటివి తినండి.

త‌ద్వారా వీటిలో ఉండే ఫైబ‌ర్ కంటెంట్ ఆక‌లిని తీర్చ‌డంతో పాటు బెల్లీ ఫ్యాట్‌ను సైతం నివారిస్తుంది.

ఉద‌యం పూట‌ టీ లేదా కాఫీ తాగే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.

కానీ టీ, కాఫీల‌కు బ‌దులు గ్రీన్ టీ తీసుకుంటే జీవ‌క్రియ చురుగ్గా మారుతుంది.

ఫ‌లితంగా ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు వేగంగా క‌రుగుతుంది. """/"/ అలాగే పొట్ట కొవ్వును క‌రిగించి శ‌రీరానికి బోలెడ‌న్ని పోష‌కాల‌ను అందించ‌డంలో వాల్‌న‌ట్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, రోజుకు ఐదు నుంచి ఎనిమిది వాల్‌న‌ట్స్‌ను నీటిలో నైటంతా నాన‌బెట్టుకుని ఉద‌యాన్నే తినాలి.

కంటి నిండా నిద్ర లేక‌పోయినా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది.అందు వ‌ల్ల‌, రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంట‌ల పాటు త‌ప్ప‌ని స‌రిగా నిద్ర పోవాలి.

నాజూకైన న‌డుమును పొందాలంటే రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేయాలి.ఒత్తిడికి దూరంగా ఉండాలి.

రోజూవారీ వంట‌ల‌ను కొబ్బ‌రి నూనెతో త‌యారు చేసుకుని తీసుకోవాలి.కూల్‌డ్రింక్స్‌, స్వీట్స్‌, ఆల్క‌హాల్, మైదా వంటి వాటికి దూరంగా ఉండాలి.

మ‌రియు శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.ఈ చిన్న చిన్న టిప్స్‌ను ఫాలో అయితే ఎలాంటి డైట్ లేకుండానే పొట్ట కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు.

వీడియో: పవిత్ర ప్రదేశంలో ఆ పని చేసిన యువతి.. మండిపడుతున్న జపానీయులు..