త‌ర‌చూ ఫుడ్ పాయిసనింగ్‌కు గుర‌వుతున్నారా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు మీకే!

సాధార‌ణంగా కొంద‌రు త‌ర‌చూ ఫుడ్ పాయిన‌సింగ్‌కు గుర‌వుతుంటారు.బయట రెస్టారెంట్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్‌ తిన్న‌ప్పుడే కాదు.

ఒక్కోసారి ఇంట్లో ఫుడ్స్ తిన్నా ఇలా జ‌రుగుతుంది.దాంతో మాటిమాటికీ హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతూ నానా తిప్ప‌లు ప‌డాల్సి ఉంటుంది.

అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటించ‌డం ద్వారా ఫుడ్ పాయిజ‌నింగ్‌కు దూరంగా ఉండొచ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మంది చేసే పొర‌పాటు ఉడికి ఉడ‌క‌ని ఆహారాలు తీసుకోవ‌డం.

ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు వంటి ఆహారాల‌ను స‌రిగ్గా ఉడికించ‌కుండా తీసుకుంటే గ‌నుక అందులో ఉండే బాక్టీరియా ఫుడ్ ఫాయిస‌న్‌కు గురి చేస్తుంది.

దాంతో కొడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి స‌మ‌స్య‌లు తీవ్రంగా ఇబ్బంది పెడ‌తాయి.అందుకే ఇకపై ఉడికి ఉడ‌క‌ని ఫుడ్స్‌ను తీసుకోవ‌డం మానేయండి.

చేతుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.తినే ముందే కాదు.

ఏవైనా ఆహార ప‌దార్థాల‌ను ప‌ట్టుకునే ముందు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి.అలాగే వంటగదిలో యూజ్ చేసే క్లాత్స్‌ను ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటాయి.

వంట‌గ‌దిని, వంట చేసుకునే పాత్ర‌ల‌ను క్లీన్‌గా ఉంచుకోవాలి.కొంద‌రు మిగిలిపోయిన‌ ఆహార పదార్థాలను గంట‌లు త‌ర‌బ‌డి బ‌య‌ట పెడుతుంటారు.

దాంతో ఆ ఫుడ్‌పై బ్యాక్టీరియా, ఫంగ‌స్ పేరుకుపోతుంది.అటువంటి ఆహారాలు తీసుకుంటే ఫుడ్ పాయిస‌న్ అవుతుంది.

కాబ‌ట్టి, మిగిలిపోయిన ఆహారాల‌ను వెంట‌నే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. """/" / కొన్ని కొన్ని ఫుడ్స్‌కు ఎస్ఫైరీ తేదీ ఉంటుంది.

మొలకలు, పాలు, గుడ్లు , రొయ్యలు, చీజ్‌, పేకేజెడ్ ఫుడ్స్ మొద‌ల‌గు వాటిని ఎస్ఫైరీ తేదీ దాటిన త‌ర్వాత అస్స‌లు తిన‌రాదు.

అలా తిన్నా ఫుడ్ పాయిస‌న్ అవుతుంది.ఇక ఫుడ్ పాయిస‌న్ అయిన‌ప్పుడు.

లెమ‌న్ జ్యూస్‌, అల్లం టీ, తుల‌సి క‌షాయం, దానిమ్మ పండు, అర‌టి పండు, పెరుగు, క‌ల‌బంద‌, ఆపిల్ సైడర్ వెనిగర్, బ్లాక్ టీ, తేనె, మింట్ టీ వంటి ఆహారాలు తీసుకుంటే వెంట‌నే రిక‌వర్ అవుతాయి.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!