గురక బాగా ఇబ్బంది పెడుతుందా.. అయితే దానికి ఇలా చెక్ పెట్టండి!

గురక( Snoring).దీని గురించి పరిచయాలు అక్కర్లేదు.

దాదాపు అందరి ఇంట్లోనూ ఎవరో ఒకరు గుర్రు గుర్రు మంటూ గురకలు పెట్టి నిద్రపోతుంటారు.

గురక పెట్టే వారికి ఎలాంటి సమస్య ఉండదు.కానీ వారి పక్కన నిద్రించే వారికి మాత్రం ఒక నరకంలా ఉంటుంది.

గుర‌క పెట్టే వారి వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు.అయితే గురక రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

ఆహారపు అలవాట్లు, అధిక బరువు, మద్యపానం ధూమపానం అలవాట్లు, అనారోగ్యమైన జీవనశైలి, శ్వాసకోశ సమస్యలు, సైనస్ ఇలా తదితర కారణాల వల్ల గురక వస్తుంటుంది.

"""/" / మిమ్మల్ని కూడా గురక బాగా ఇబ్బంది పెడుతుందా.అయితే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలతో దానికి సులభంగా చెక్ పెట్టండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ), చిటికెడు జాజికాయ తురుము, అంగుళం దంచిన అల్లం ముక్క, రెండు స్పూన్లు ఎండిన చామంతి పూలు వేసుకుని మరిగించాలి.

వాటర్ సగం అయిన త‌ర్వాత ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి నైట్ నిద్రించడానికి గంట ముందు తీసుకోవాలి.

ఈ హెర్బల్ టీ గురక సమస్యను దూరం చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.శ్వాస నాళాల్లో అడ్డంకులు ఏమైనా ఉన్నా కూడా తొలగిస్తుంది.

"""/" / గురకను నివారించడానికి వెల్లుల్లి కూడా ఉత్తమంగా సహాయపడుతుంది.రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి మెత్తగా దంచాలి.

ఇలా దంచిన మిశ్రమం నుండి వెల్లుల్లి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో కొద్దిగా తేనె( Honey ) కలిపి తీసుకోవాలి.

రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేస్తే గురక రాకుండా ఉంటుంది.అలాగే గురక రాకుండా ఉండాలంటే నిద్రించేటప్పుడు నిటారుగా కాకుండా ఎడమ వైపుకు తిరిగి నిద్రించాలి.

ఒకవేళ స్ట్రైట్ గా పడుకోవాలి అనుకుంటే కాళ్లు ఎత్తులో ఉండేలా తల కింద పిల్లో లేకుండా చూసుకోవాలి.

గురక సమస్యతో బాధపడేవారు నిత్యం ఇర‌వై నిమిషాల పాటు వ్యాయామాలు, యోగా వంటివి చేయండి.

అధిక బరువును అదుపులోకి తెచ్చుకోండి.మద్యపానం ధూమపానం అలవాట్లను వదులుకోండి.

ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయండి.

వాటర్ ఎక్కువగా తీసుకోండి.డైట్ లో నట్స్, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, గింజలు ఉండేలా చూసుకోండి.

ఇవన్నీ గురక సమస్యను సహజంగానే కంట్రోల్ చేస్తాయి.

మహేష్ బాబు నంబర్ వన్.. నాని నంబర్2.. ఈ హీరోలకు సొంతమైన రికార్డ్ ఇదే!