ఇలా చేస్తే దోమలు ఇంటిలో నుంచి పారిపోతాయి...రమ్మన్నా రావు
TeluguStop.com
సీజన్ ఏదైనా దోమలు మాత్రం మనల్ని విడిచి వెళ్ళటం లేదు.కరెంట్ పొతే చాలు
గుయ్ మని దోమలు రెడీ అయ్యిపోతాయి.
దోమల నివారణకు మస్కిటో కోయల్స్ వాడుతూ
ఉంటాం.వాటి వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు వస్తాయి.
ఎటువంటి ఇబ్బంది
లేకుండా సహజసిద్ధమైన పద్దతుల్లో దోమలను తరిమికొట్టవచ్చు.ఇప్పుడు ఆ
విధానాల గురించి వివరంగా తెలుసుకుందాం.
దోమలు కార్బన్ డై ఆక్సైడ్ కు ఆకర్షితం అవుతాయి.అందువల్ల కార్బన్ డై
ఆక్సైడ్ విడుదల చేసే ఐస్ ముక్కలను ఒక బాక్స్ లో పెట్టి దోమలు ఉన్న
ప్రదేశంలో పెడితే దోమలు అన్ని ఆ ప్రదేశంలోకి వస్తాయి.
అప్పుడు దోమల
ఎలక్ట్రికల్ బ్యాట్ తో దోమలను చంపవచ్చు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
వేప నూనె,కొబ్బరి నూనె రెండిటిని సమ భాగాల్లో తీసుకోని బాగా కలిపి
చర్మంపై రాసుకోవాలి.
ఇది రాసుకున్నాక 8 గంటల పాటు పనిచేస్తుంది.ఇలా
రాసుకోవటం వలన దోమలు వచ్చిన వేప వాసనకు పారిపోతాయి.
లెమన్ ఆయిల్ , యూకలిప్టస్ ఆయిల్ రెండిటిని సమ భాగాల్లో తీసుకోని బాగా
కలిపి చర్మంపై రాసుకోవాలి.
వీటిలో ఉండే సినోల్ అనే రసాయనం యాంటీ సెప్టిక్,
కీటక నివారిణిగా పనిచేసి దోమలను తరిమికొడుతుంది.
వీటి వల్ల చర్మానికి
ఎటువంటి హాని ఉండదు.కర్పూరం కూడా దోమలను నివారించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
సాయంత్రం
చీకటి పడుతున్న సమయంలో తలుపులు అన్ని మూసి కర్పూరాన్ని వెలిగించండి.ఒక
అరగంట తర్వాత తలుపు తీసి చూస్తే
దోమలు అన్ని చనిపోయి ఉంటాయి.
కర్పూరం ఘాటుకి దోమలు చనిపోతాయి.