Cough Home Remedies : దగ్గును తరిమికొట్టే వంటింటి చిట్కాలు.. వీటి ముందు మందులు కూడా దిగదుడుపే!

cough home remedies : దగ్గును తరిమికొట్టే వంటింటి చిట్కాలు వీటి ముందు మందులు కూడా దిగదుడుపే!

ప్రస్తుత సీజన్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మంది దగ్గు ( Cough ) సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు.

cough home remedies : దగ్గును తరిమికొట్టే వంటింటి చిట్కాలు వీటి ముందు మందులు కూడా దిగదుడుపే!

దగ్గు కారణంగా విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు.దగ్గు వల్ల పనిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేరు.

cough home remedies : దగ్గును తరిమికొట్టే వంటింటి చిట్కాలు వీటి ముందు మందులు కూడా దిగదుడుపే!

పైగా దగ్గు వల్ల కొందరికి రాత్రుళ్ళు సరిగా నిద్ర కూడా పట్టదు.ఈ క్రమంలోనే దగ్గును వదిలించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు.

ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.అయితే దగ్గును తరిమికొట్టే పవర్ ఫుల్ వంటింటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.

వీటి ముందు మందులు కూడా దిగదుడుపే.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

లవంగాలు దగ్గును తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి.లవంగాలు( Cloves ) యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్ష‌ణాల‌తో నిండి ఉంటాయి.

అందువ‌ల్ల రెండు చిటికెల లవంగాల పొడిలో కొద్దిగా తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు సమస్య పరార్ అవుతుంది.

"""/" / అలాగే పాలల్లో ఉసిరికాయ ముక్కలను ఉడికించి ఎండబెట్టి పొడి చేసుకోవాలి.

ఈ పొడిని ప్ర‌తి రోజు హాఫ్‌ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని నెయ్యి కలిపి తినాలి.

ఉసిరికాయ పొడిలో ( Amla Powder ) ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్‌ దగ్గుకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

చాలా వేగంగా దగ్గు సమస్యను నివారిస్తాయి. """/" / తమలపాకులు ( Betel Leaves ) కూడా దగ్గును వదిలించుకునేందుకు సహాయపడతాయి.

తమలపాకుల నుండి రసం తీసి వేడి చేయాలి.అలా వేడి చేసిన తమలపాకుల రసం పూర్తిగా చల్లారిన తర్వాత తేనె కలిపి తీసుకోవాలి.

ఇలా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు చేస్తే దగ్గు పరార్ అవుతుంది.ఇక ఆవు పాలలో పసుపు, మిరియాలు మరియు తాటి బెల్లం వేసి మరిగించి రోజు నైట్ పడుకునే ముందు తీసుకోవాలి.

ఇలా చేసినా కూడా దగ్గు దూరం అవుతుంది.ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.

రివ్యూలపై ఫైర్ అయిన నాగవంశీ.. దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయాలంటూ?

రివ్యూలపై ఫైర్ అయిన నాగవంశీ.. దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయాలంటూ?