వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించే సింపుల్ చిట్కాలు మీకోసం!
TeluguStop.com
ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది.ఎక్కడ చూసినా జోరుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.
ఈ సీజన్‌లో ఆరోగ్య మరియు చర్మ సమస్యలే కాదు.జుట్టు సంబంధిత సమస్యలు సైతం అధికంగానే వేధిస్తూ ఉంటాయి.
జుట్టు రాలడం, చిట్లడం, చుండ్రు, కేశాలు పొడిబారిపోవడం ఇలా రకరకాల జుట్టు సమస్యలు ఇబ్బందికి గురిచేస్తాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే.ఆయా సమస్యలు పరార్ అవ్వడమే కాదు జుట్టు ఆరోగ్యంగా కూడా మారుతుంది.
మరి లేటెందుకు జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించే ఆ చిట్కాలు ఏంటో చూసేయండి.ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు ఎర్ర గుమ్మడి కాయ ముక్కలు, అర కప్పు వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేసి.
రెండు గంటల పాటు షవర్ క్యాప్‌ను ధరించాలి.ఆపై మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.
ప్రస్తుత వర్షాకాలంలో ఈ చిట్కాను వారంలో ఒకసారి ట్రై చేస్తే హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, డ్రై హెయిర్, చుండ్రు వంటి సమస్యలు దూరమై జుట్టు బలంగా, ఆరోగ్యంగా మారుతుంది.
"""/" /
అలాగే మరో చిట్కా ఏంటంటే.బ్లెండర్ తీసుకుని అందులో ఒక అరటి పండు, వన్ టేబుల్ స్పూన్ శెనగ పిండి, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక ఫుల్ ఎగ్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను మిక్స్ చేసి.
జుట్టు మొత్తానికి పట్టించాలి.గంట పాటు షవర్ క్యాప్‌ను ధరించి.
ఆపై షాంపూ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించినా.
వర్షాకాలంలో మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
నాగార్జున తన కొడుకుల విషయం లో జోక్యం చేసుకోడా..? ప్రస్తుతం అఖిల్ పరిస్థితి ఏంటి..?