చర్మ సౌందర్యాన్ని పెంచే సింపుల్ టిప్స్ ఇవి.. తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు!
TeluguStop.com
అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.కానీ పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు, జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పులు, చర్మ సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్ల ఎప్పుడు ఏదో ఒక చర్మ సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
మొటిమలు, మచ్చలు, ముడతలు, బ్లాక్ హెడ్స్, చర్మం పొడిబారడం, స్కిన్ టోన్ తగ్గిపోవడం, చర్మం సాగటం తదితర సమస్యలు తలెత్తుతుంటాయి.
అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడు తెగ హైరానా పడిపోతుంటారు.ఎలా తగ్గించుకోవాలి? చర్మాన్ని మళ్లీ మునుపటిలా ఎలా మెరిపించుకోవాలి? అంటూ సతమతం అయిపోతూ ఉంటారు.
కానీ ఆయా సమస్యలకు పరిష్కారాలు మీ ఇంట్లోనే ఉన్నాయి.ఎలాంటి చర్మ సమస్యనైనా ఇంట్లోనే సులభంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ తో దూరం చేసుకోవచ్చు.
చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు.మరి ఆ సింపుల్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మం తెల్లగా మారాలన్నా.కాంతివంతంగా మెరవాలన్నా.
రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్( Tomato Juice ) లో మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోండి 20 నిమిషాల తర్వాత వాటర్ తో వాష్ చేయండి.
రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే స్కిన్ టోన్ పెరుగుతుంది.చర్మం సూపర్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.
"""/" /
లాగే ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి మిక్స్ చేసుకుని.
ముఖానికి పూతలా అప్లై చేయాలి.20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల సాగిన చర్మం టైట్ గా మారుతుంది.చర్మం పై డస్ట్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మొటిమలు మచ్చలతో బాధపడేవారు వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిలో( Cinnamon Powder ) రెండు టేబుల్ స్పూన్లు తేనెను కలిపి ముఖానికి అప్లై చేయాలి.
15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే మొండి మొటిమలు మచ్చలు పరార్ అవుతాయి.
బ్లాక్ హెడ్స్ తో ఇబ్బంది పడుతున్న వారు ఒక ఎగ్ వైట్ ను బౌల్ లోకి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.
20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
"""/" /
ఇక వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ) లో చిటికెడు పసుపు, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి.
ఐదారు నిమిషాల పాటు చేతివేళ్లతో సున్నితంగా చర్మాన్ని మసాజ్ చేసుకుని కాస్త డ్రై అయిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేస్తే ముడతలు మాయం అవుతాయి.చర్మం యవ్వనంగా మారుతుంది.
డ్రై స్కిన్ దూరమవుతుంది.
ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..