బ‌రువు పెర‌గాలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే స‌రి!

బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నించే వారు ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు.స్లిమ్‌గా మారేందుకు నోరు క‌ట్టేసుకుని ర‌క‌ర‌కాల డైట్‌లు ఫాలో అవ్వ‌డం, చెమ‌ట‌లు చిందేలా వ్యాయామాలు చేయ‌డం, కేల‌రీ ఫుడ్‌కు దూరంగా ఉండ‌టం ఇలా ఎన్నో చేస్తుంటారు.

అయితే మ‌రోవైపు కొంద‌రేమో బ‌రువు పెరిగేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.మ‌రీ స‌న్నీ బ‌క్క చిక్కిన‌ట్టు ఉంటే.

అంద‌హీనంగా క‌నిపిస్తారు.అందుకే బ‌రువు పెరిగేందుకు ట్రై చేస్తారు.

ఇక బరువు తగ్గాలంటే కష్టం గానీ పెరగటం కష్టమా అని చాలా మంది భావిస్తుంటారు.

కాని కొందరు ఎంత ప్రయత్నించినా బరువు పెరగరు.అలాంటి వారు ఇప్ప‌బోయే సింపుల్ టిప్స్ ఫాలో అయితే సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు.

బ‌రువు పెంచ‌డంలో కొబ్బ‌రి పాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, బ‌రువు పెర‌గాలి అని భావించే వారు ఇంట్లో త‌యారు చేసుకునే కొబ్బ‌రి పాలను రోజుకో గ్లాస్ చ‌ప్పున తీసుకుంటే మంచిది.

అలాగే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికే కాదు.బ‌రువు పెంచ‌డంలోనూ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ప్ర‌తి రోజు బాదం, జీడిప‌ప్పు, ఎండుద్రాక్ష, వాల్న‌ట్స్‌, పిస్తా ప‌ప్పు వంటివి తీసుకోవాలి.

"""/"/ కేల‌రీలు పుష్క‌లంగా ఉండే చీజ్ బ‌రువు పెంచ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, రోజుకు త‌గిన మోతాదులో చీజ్‌ను తీసుకుంటే మంచిది.

బరువు పెరగాలి అనుకునే వాళ్లకి వైట్ రైస్ బెస్ట్ అప్ష‌న్‌.వైట్ రైస్‌లో కేల‌రీల‌తో పాటు పిండి పదార్థాలు పుష్క‌లంగా ఉంటాయి.

కాబ‌ట్టి, రెగ్యుల‌ర్‌గా వైట్ రైస్ తీసుకుంటే మంచిది.ఇక వేగంగా బ‌రువు పెర‌గాలి అని భావించే వారు.

ఒక గ్లాస్ పాల‌లో ఒక అర‌టి పండు వేసి.జ్యూస్‌లా త‌యారు చేసుకుని తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

ప్రొటీన్ పుష్క‌లంగా ఉండే మాంసం, చేపలు, రొయ్యాలు, గుడ్డు పెరుగు వంటివి వైట్‌లో చేర్చుకుంటే.

త్వ‌ర‌గా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు.అలాగే వ్యాయామం అనేది బ‌రువు త‌గ్గ‌డానికే కాదు.

బ‌రువు పెర‌గ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా స్క్వాట్​​, వెయిట్ లిఫ్టింగ్ లాంటివి చేస్తే బ‌రువు పెర‌గ‌వ‌చ్చు.

బిగ్ బాస్ 8 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాగచైతన్య శోభిత… ఇదెక్కడి షాకింగ్ ట్విస్ట్!