ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే అండర్ ఆర్మ్స్ లోని నలుపు దెబ్బకు మాయమవుతుంది!

స్త్రీలలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య డార్క్ అండర్ ఆర్మ్స్.( Dark Underarms ) బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, సరిగ్గా గాలి ఆడక పోవడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, అక్కడి హెయిర్ ను ఎప్పటికప్పుడు తొలగించకపోవడం తదితర కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతుంటాయి.

దీంతో ఆడవారు ఇష్టమైన దుస్తులు ధరించేందుకు వెనకడుగు వేస్తుంటారు.ముఖ్యంగా స్లీవ్ లెస్ దుస్తులు వేసుకుంటే డార్క్ అండర్ ఆర్మ్స్ బహిర్గతం అవుతాయని భయపడుతుంటారు.

ఈ క్రమంలోనే డార్క్ అండర్ ఆర్మ్స్ ను వదిలించేందుకు తోచిన ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే అండర్ ఆర్మ్స్ లో నలుపు దెబ్బకు మాయమవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు పాలు( Milk ) పోయాలి.

పాలు హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ( Coconut Oil ) హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు,( Turmeric ) వన్ టేబుల్ స్పూన్ షుగర్ ( Sugar ) వేసి ఐదు నిమిషాల పాటు హీట్ చేయాలి.

"""/" / ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన పాలను కాస్త చల్లార బెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ పాలలో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

"""/" / ఆపై తడి వేళ్ళతో సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా అండర్ ఆర్మ్స్ ను క్లీన్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే అండర్ ఆర్మ్స్ లో నలుపు చాలా త్వరగా మాయమవుతుంది.

అండర్ ఆర్మ్స్ కొద్దిరోజుల్లోనే తెల్లగా మృదువుగా మారతాయి.కాబట్టి డార్క్ అండర్ ఆర్మ్స్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

సహజంగానే సమస్యను నివారించుకోండి.

ఆట మొదలెట్టిన డొనాల్డ్ ట్రంప్ .. 7.25 లక్షల మంది భారతీయులు ఇంటికే?