సమ్మర్‌లో స్కిన్ టోన్‌ను కాపాడే సింపుల్ రెమెడీస్ ఇవే!
TeluguStop.com
సమ్మర్ సీజన్ షురూ అయింది.ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు భానుడు భగభగమంటూ ప్రజలపై తన ప్రతాపాన్ని అంతా చూపిస్తున్నాడు.
ఇక ప్రస్తుత సమ్మర్‌లో మండే ఎండల కారణంగా స్కిన్ టోన్‌ను కాపాడుకోవడం ఎంతో కష్టతరంగా మారుతుంటుంది.
అందుకే చాలా మంది అమ్మాయిలు సమ్మర్‌లో బయట కాలు పెట్టేందుకు భయపడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీస్‌ను పాటిస్తే సమ్మర్ లో స్కిన్ టోన్‌ను సులభంగా కాపాడుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం పదండీ.కాబూలీ శనగలు.
ఇవి మామూలు శనగలకంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి.అలాగే చర్మానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా స్కిన్ టోన్ పెంచడంలో కాబూలీ శనగలు బాగా సహాయపడతాయి.కొన్ని కాబూలీ శనగలు తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిలో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, మూడు టేబుల్ స్పూన్ల బాదం మిల్క్, చిటికెడు కస్తూరి పసుపు వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి జస్ట్ ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
ఆపై నార్మల్ వాటర్‌తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.సమ్మర్‌లో రెండు రోజులకు ఒక సారి ఇలా చేస్తే మీ స్కిన్ టోన్ తగ్గడం కాదు పెరుగుతుంది.
"""/"/
అలాగే మరో రెమెడీ ఏంటంటే.ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు కస్తూరి పసుపు వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూసి.బాగా ఆరిన వెంటనే వాటర్‌తో వాష్ చేసుకోవాలి.
ఈ చిట్కాను పాటించినా సమ్మర్‌లో స్కిన్ టోన్ తగ్గకుండా ఉంటుంది.
సుజీత్ 10 సంవత్సరాల కెరియర్ లో కేవలం 2 సినిమాలు మాత్రమే చేశాడా..?