వారంలో 2 సార్లు ఇలా చేస్తే చిట్లిన జుట్టుకు బై బై చెప్ప‌వ‌చ్చు!

జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం.దీనినే స్ప్లిట్ ఎండ్స్ అని అంటారు.

అత్య‌ధికంగా వేధించే జుట్టు స‌మ‌స్య‌ల్లో ఇదీ ఒక‌టి అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, ఆయిల్‌ను ఎవైడ్ చేయ‌డం, జుట్టులోని తేమ త‌గ్గిపోవ‌డం, రెగ్యుల‌ర్‌గా షాంపూ చేసుకోవ‌డం, త‌డి జుట్టును జ‌డ వేసుకోవ‌డం లేదా దువ్వ‌డం, హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను త‌ర‌చూ వినియోగించ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు చిట్లిపోతూ ఉంటుంది.

దీని వ‌ల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.దాంతో చిట్లిన జుట్టును నివారించుకోవ‌డం కోసం నానా ప్ర‌యత్నాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని వారంలో రెండు సార్లు పాటిస్తే.సుల‌భంగా చిట్లిన జుట్టుకు బై బై చెప్ప‌వ‌చ్చు.

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ఆ రెమెడీ ఏంటో చూసేయండి.ముందుగా ఒక క‌ల‌బంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.

ఇలా క‌డిగిన క‌ల‌బంద‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న క‌ల‌బంద ముక్క‌లు, రెండు టేబుల్ స్పూన్ల మెంతులు, అర క‌ప్పు వాట‌ర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

మెత్త‌గా గ్రైండ్ చేసుకున్నాక‌.ఆ మిశ్ర‌మం నుండి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.

ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

"""/" / వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే.క‌ల‌బంద‌, మెంతులు మ‌రియు ఆముదంలో ఉండే ప‌లు సుగుణాలు జుట్టులోని తేమను లాక్ చేసి చిట్లకుండా ఆపుతాయ‌.

అదే స‌మ‌యంలో చిట్లిన జుట్టును రిపేర్ చేసి.ఒత్తైన, పొడ‌వాటి కురుల‌ను మీ సొంతం చేస్తాయి.

బీచ్ ఒడ్డున గ్లామర్ షోతో ఫోటోషూట్స్… చూసిన వాళ్లకు చుక్కలు