డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలతో వాటికి బై బై చెప్పండి!
TeluguStop.com
డార్క్ సర్కిల్స్.( Dark Circles ) అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.
ముఖ్యంగా కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, ఆహారపు అలవాట్లు, శరీరంలో అధిక వేడి తదితర కారణాల వల్ల కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.
ఇవి చూసేందుకు కాస్త అసహ్యంగా కనిపిస్తుంటాయి.అందాన్ని పాడు చేస్తాయి.
అందుకే డార్క్ సర్కిల్స్ నివారించుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలతో( Dark Circles Tips ) డార్క్ సర్కిల్స్ కు సులభంగా బై బై చెప్పండి.
"""/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Juice ) వేసుకోవాలి.
అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బంగాళదుంప జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ క్రీమ్ ను నైట్ నిద్రించే ముందు కళ్ళ చుట్టూ అప్లై చేసి కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను అప్లై చేసుకుంటే నల్లటి వలయాలు దెబ్బకు పరార్ అవుతాయి.
"""/" /
అలాగే డార్క్ సర్కిల్స్ సమస్యను వదిలించడానికి జాజికాయ అద్భుతంగా సహాయపడుతుంది.
ఒక జాజికాయ( Jajikaya )ను తీసుకొని ఏదైనా రాతిపై వాటర్ సహాయంతో బాగా రబ్ చేయాలి.
అలా వచ్చిన స్మూత్ పేస్ట్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా చేసిన సరే నల్లటి వలయాలు మాయం అవుతాయి.
"""/" /
ఇక మరొక విధంగా కూడా డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవచ్చు.
అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు మజ్జిగ వేసుకోవాలి.
అలాగే చిటికెడు పసుపు( Turmeric ) వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఇందులో కాటన్ ప్యాడ్స్ ను నానబెట్టి.
ఆపై వాటిని కళ్ళపై పెట్టుకోవాలి.అరగంట తర్వాత వాటిని తొలగించి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒకసారి చేసినా సరే డార్క్ సర్కిల్స్ చాలా వేగంగా మాయం అవుతాయి.
EU Online Gambling Laws — Practical Strategy For High Rollers With Montreal Casino Online Interests