కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. చిటికెలో తగ్గించే చిట్కాలు ఇవి!
TeluguStop.com
దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కడుపు నొప్పిని( Stomach Pain ) అనుభవించే ఉంటారు.
కడుపు నొప్పి వెనుక గల కారణాలు వివిధ రకాలుగా ఉంటాయి.కలుషితమైన ఆహారం తీసుకోవడం, గ్యాస్, అధిక మసాలాలు గల ఆహారం తినడం, పేగు సమస్యలు, ఖాళీ కడుపుతో ఎక్కువ సమయం గడపడం, మూత్రపిండ సమస్యలు, మానసిక ఒత్తిడి, ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం తినడం, నెలసరి తదితర కారణాల కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది.
అలాంటి సమయంలో ఎక్కువ శాతం మంది నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు.
అయితే సాధారణ కడుపు నొప్పిని చిటికెలో తగ్గించే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక గ్లాస్ వాటర్ లో వన్ టీ స్పూన్ జీలకర్ర,( Cumin Seeds ) వన్ టీ స్పూన్ సోంపు, చిటికెడు ఇంగువ( Inguva ) వేసి ఐదారు నిమిషాల పాటు మరిగించండి.
ఈ నీటిని వడకట్టి తీసుకోండి.గ్యాస్ వల్ల వచ్చే కడుపు నొప్పిని తగ్గించడంలో ఈ పానీయం చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి. """/" /
హాట్ వాటర్ ను నెమ్మదిగా తాగడం ద్వారా సాధారణ కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
లేదా గోరు వెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం జ్యూస్ కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
అల్లం( Ginger ) జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.కడుపు నొప్పిని దూరం చేస్తుంది.
"""/" /
కడుపు నొప్పి నుండి రిలీఫ్ ను అందించడంలో పుదీనా( Mint ) న్యాచురల్ మెడిసిన్‌లా పని చేస్తుంది.
కొన్ని పుదీనా ఆకులను ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి తీసుకోండి.లేదా ఐదారు ఫ్రెష్ పుదీనా ఆకులను నమిలి తినండి.
కడుపు నొప్పి తక్షణంగా తగ్గకపోయినా లేదా తీవ్రంగా ఉన్న డాక్టర్‌ను సంప్రదించడం ఎంతో ఉత్తమం.
అబ్బా ఏం తెలివి.. ముంబై పోలీసు పరీక్షలో చిరంజీవి స్టైల్‌లో మోసం..!