పొడిబారిన చేతుల‌ను మృదువుగా మార్చే సింపుల్ టిప్స్‌!

సాధార‌ణంగా ఒక్కో స‌మ‌యంలో చేతులు మృదుత్వాన్ని కోల్పోయి.పొడిబారిన‌ట్టు అయిపోతాయి.

ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డ‌తారు.ఇక మ‌హిళ‌ల విష‌యానికి వ‌స్తే.

వారు ప్ర‌తిరోజు గిన్నెలు కడగడం, బ‌ట్ట‌లు ఉత‌క‌డం వ‌ల్ల‌ చేతుల్లో పగుళ్లు ఏర్పడి.

అంద‌హీనంగా మార‌తాయి.ఈ క్ర‌మంలోనే చేతుల‌ను మృదువుగా మార్చుకునేందుకు ఎన్ని చిట్కాలు పాటించినా ఫ‌లితం లేక చింతిస్తుంటారు.

అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.చేతులు మృదువుగా మ‌రియు అందంగా కూడా మార‌తాయి.

ముందుగా.ఆలివ్ ఆయిల్ మ‌రియు కొబ్బ‌రి నూనె రెండు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని చేతుల‌కు అప్లై చేసి.కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తిరోజు చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా చేతులు మృదువుగా మార‌తాయి. """/" / బంగాళాదుంప‌ను ఉడ‌కిబెట్టి.

మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా బాదాం నూనె మ‌రియు గ్లిజరిన్ రెండూ వేసి మిక్స్ చేసి.

చేతుల‌కు అప్లై చేయాలి.ఒక గంట పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల‌.

చేతులు మృదువుగా, కోమ‌లంగా మార‌తాయి.అలాగే కొద్దిగా తేనెలో పంచ‌దార మ‌రియు నిమ్మ‌రసం వేసి.

చేతుల‌కు నాలుగు నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి.అనంత‌రం గోరువెచ్చ‌టి నీటితో చేతుల‌ను శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల మృత కణాలు తొల‌గి.మృదువుగా, అందంగా మార‌తాయి.

ట‌మాటా ర‌సంలో కొద్దిగా రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి.చేతుల‌కు అప్లై చేయాలి.

బాగా ఆరిన త‌ర్వాత నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా పొడిబారిన చేతులు మృదువుగా మార‌తాయి.

బాలయ్య సినిమాకు పోటీగా ప్రభాస్ సినిమా రిలీజ్ కానుందా.. రిలీజయ్యేది అప్పుడేనా?