గుండె జబ్బులు ఉన్నవారు చేయాల్సిన వ్యాయామాలు
TeluguStop.com
గుండె జబ్బులు ఉన్నవారు ఖచ్చితంగా వ్యాయామాలు,ఆహార నియమాలు పాటించాలి.గుండె జబ్బులు ఉన్నవారు ఎప్పటికప్పుడు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
గుండె జబ్బులు ఉన్నవారు ప్రతి రోజు ఎలాంటి వ్యాయామం చేయాలో తెలుసుకుందాం.గుండెజబ్బులు ఉన్నవారు తేలికపాటి ఏరోబిక్స్ వంటి వ్యాయామాలను చేయాలి.
వేరే వ్యాయామాలు అయితే గుండెపై భారాన్ని చూపే అవకాశం ఉంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
ప్రతి రోజు అరగంట సేపు వ్యాయామం చేయాలి.
రోజుకి 5 నిమిషాలతో మొదలు పెట్టి
క్రమంగా సమయాన్ని పెంచుతూ అరగంట చేసేలా ప్రణాళిక ఉండాలి.
ఒకేసారి అరగంట వ్యాయామం చేయలేని వారు ఉదయం 15 నిముషాలు,సాయంత్రం 15
నిముషాలు చేయాలి.
ఒకేసారి చేయకపోయినా రెండు భాగాలుగా చేసుకొని వ్యాయామం
చేసుకోవచ్చు.వ్యాయామాలు చేయటానికి ముందు కొంచెం నడక లేదా స్ట్రెచింగ్ లాంటివి చేయాలి.
వ్యాయామం చేసినప్పుడు మధ్యలో విరామాలు ఇస్తూ ఉండాలి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
శ్రమ కలిగించే వ్యాయామాలను చేయకూడదు.
5 నిముషాలు నడిచిన తర్వాత మాత్రమే
వ్యాయామాలను చేయటం ప్రారంభించాలి.వాతావరణం చలిగా ఉంటే బయట వ్యాయామాలు చేయకూడదు.
బయట చేస్తే శ్వాస సంబంధ
సమస్యలు వచ్చి ఆ భారం గుండె మీద పడుతుంది.
గుండె సమస్యలు ఉన్నవారికి మొడిటేషన్ లేదా ధ్యానం చేయటం చాలా మంచిది.అది
వారి మైండ్ ను రిలాక్స్ చేసి మంచి శ్వాస ప్రక్రియను కలిగిస్తుంది.
అంతేకాక ప్రశాంతతను కలిగిస్తుంది.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో తెలుసా..?