మొటిమలు పోయినా వాటి మచ్చలు తగ్గట్లేదా? అయితే ఈ రెమెడీ మీకోసమే!
TeluguStop.com
మొటిమలు.టీనేజ్ మొదలు ముప్పై, నలబై ఏళ్లు వచ్చే వరకు వేధిస్తూనే ఉంటాయి.
హార్మోన్ ఛేంజస్, ఆహారపు అలవాట్లు, చర్మంపై ఆయిల్ ఉత్పత్తి అధికంగా ఉండటం, చుండ్రు, పలు రకాల మందుల వాడకం, ఒత్తిడి వంటి రకరకాల కారణాల వల్ల మొటిమలు తీవ్రంగా మదన పెడుతుంటాయి.
అయితే ఒక్కోసారి మొటిమలు పోయినా వాటి తాలూకు మచ్చలు మాత్రం తగ్గనే తగ్గవు.
ఆ మచ్చలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.దాంతో ఆ మచ్చలను వదిలించుకోవడం కోసం మార్కెట్‌లో లభ్యమయ్యే క్రీములపై ఆధారపడుతుంటారు.
అయితే ఇంట్లో కూడా మొటిమల తాలూకు మచ్చలను మాయం చేసుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోం రెమెడీ గ్రేట్‌గా హెల్ప్ చేస్తుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ శెనగపిండి, వన్ టేబుల్ స్పూన్ వేపాకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, సరిపడా రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/"/
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో మచ్చలు ఉన్న చోటే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకోవాలి.
ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకుని.ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
అనంతరం ఏదైనా మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ను ముఖానికి రాసుకోవాలి.ఈ సూపర్ ఎఫెక్టివ్ హోం రెమెడీని రోజుకు ఒకసారి ట్రై చేస్తే మొటిమల తాలూకు మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.
అదే సమయంలో ముఖం అందంగా, కాంతివంతంగా కూడా మారుతుంది.కాబట్టి, తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
గేమ్ ఛేంజర్ పై కావాలనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారా.. వాళ్ల కష్టం గురించి ఆలోచించరా?