పొడిబారిన పెదాలను రిపేర్ చేసే సింపుల్ అండ్ న్యాచురల్ టిప్స్ మీకోసం!

ప్రస్తుత చలికాలంలో( Winter ) ప్రతి ఒక్కరిని మ‌ద‌న పెట్టే సమస్యల్లో డ్రై లిప్స్( Dry Lips ) ఒకటి.

వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా పెదాలు పొడిగా మారుతుంటాయి.కొందరికి పెదాలు పగిలి రక్తం కూడా వ‌స్తుంటుంది.

ఇటువంటి పెదాలను బాగు చేసుకోవడం కోసం తరచూ లిప్ బామ్, పెట్రోలియం జెల్లీ వంటివి వాడుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ మీ పొడిబారిన పెదాలను న్యాచురల్ గానే రిపేర్ చేస్తాయి.

మరియు లిప్స్ ను ఎల్లప్పుడూ తేమగా, మృదువుగా ఉంచుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ అండ్ న్యాచురల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

"""/" / పగిలిన పెదాలను రిపేర్ చేయడానికి పాలమీగడ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

పాల మీగడలో ఉండే గుడ్ ఫ్యాట్స్‌ పెదవులకు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి.అలాగే పగిలిన అధరాలను తిరిగి మామూలు స్థితికి తెస్తాయి.

అందువల్ల నైట్ నిద్రించే ముందు పెదాలకు పాలమీగ‌డ‌ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ఉద‌యాన్నే వాట‌ర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా నిత్యం కనుక చేస్తే డ్రై లిప్స్ అన్న మాటే అనరు.

"""/" / అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం( Castor Oil ), నాలుగు చుక్కల గ్లిజరిన్( Glycerin ) మరియు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల పొడి బారిన పెదాలు మృదువుగా కోమలంగా తయారవుతాయి.

పెదాల ప‌గుళ్లు దూరం అవుతాయి.మరియు ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే పెదాల నలుపు సైతం క్రమంగా మాయం అవుతుంది.

"""/" / ఇక పచ్చి పాలలో కొన్ని గులాబీ రేకులు వేసి బాగా నానబెట్టుకోవాలి.

ఆపై మిక్సీ జార్ తో గులాబీ రేకుల‌ను పాలతో సహా వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని తరచూ పెదాలకు అప్లై చేయడం వల్ల లిప్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి.

తేమగా మృదువుగా మెరుస్తాయి.అందంగా మారతాయి.

నాలుక మడతేసిన హరీష్ ? ఎదురుదాడి ముందే ఊహించారుగా