ఈ చిన్న చిన్న చిట్కాలే మొటిమల్లేని చర్మాన్ని మీసొంతం చేస్తాయి!
TeluguStop.com
ఎంతటి అందమైన చర్మం అయినా ఒక్క మొటిమతో పాడవుతుంది.అందుకే మొటిమలు అంటే భయపడుతుంటారు కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.
మొటిమలు వస్తూనే ఉంటాయి.ఆహారపు అలవాట్లు, హార్మోన్ ఛేంజస్, మద్యపానం, ధూమపానం, చర్మంపై మురికి మృతకణాలు పేరుకుపోవడం వంటి రకరకాల కారణాల వల్ల మొటిమలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
అయితే అలాంటి సమయంలో హైరానా పడిపోకుండా ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మొటిమల్లేని మెరిసేటి చర్మాన్ని తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు అందులో కాటన్ ప్యాడ్‌ను నానబెట్టి.దాన్ని మొటిమలు ఉన్న చోట పెట్టుకోవాలి.
పావు గంట అనంతరం కాటన్ ప్యాడ్‌ను తొలగించి వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి.
అలాగే స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో గుప్పెడు వేపాకులు, గుప్పెడు తులసి ఆకులు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మరిగించాలి.
"""/"/ ఆపై ఈ వాటర్‌తో ముఖానికి ఆవిరి పట్టుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయమై ముఖం గ్లోయింగ్‌గా మారుతుంది.
ఇక ఒక బౌల్‌లో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల అనంతరం వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ చిట్కాను పాటించినా మంచి ఫలితం ఉంటుంది.
సినిమా హిట్ అవ్వాలంటే ఆమె పాత్రని చంపేయాలి.. వివాదాస్పదమవుతున్న రానా, తేజ సజ్జా కామెంట్స్!