సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు మధ్య ఉన్న పోలికలివే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులుగానే కాక స్నేహపూర్వకంగా మెలిగిన నటులుగా ఎన్టీఆర్,ఎన్నార్ లకు పేరుంది.

సినిమాల పరంగా ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నా బయట మాత్రం ఎన్టీఆర్, ఎన్నార్ ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు.

ఎన్టీఆర్, ఎన్నార్ స్నేహం గొప్పదనం గురించి ఇప్పటికీ టాలీవుడ్ సీనియర్ రచయితలు, దర్శకులు కథలుకథలుగా చెబుతూ ఉంటారు.

ఎన్టీఆర్, ఎన్నార్ కలిసి 14 సినిమాల్లో నటించారు.వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా పల్లెటూరి పిల్ల కాగా చివరి సినిమా సత్యం శివం.

ఈ 14 సినిమాలలో దాదాపు అన్నిసినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే కావడం గమనార్హం.

సంవత్సరంలో విడుదలయ్యే మొత్తం సినిమాల్లో దాదాపు సగం సినిమాలు ఎన్టీఆర్, ఎన్నార్ లవే ఉండేవని వాళ్లకు సినిమాల పట్ల ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ వల్ల తక్కువ సమయంలోనే సినిమా షూటింగ్ పూర్తయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు.

తెలుగుజాతి గర్వించదగ్గ నటులుగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, ఎన్నార్ లకు క్రమశిక్షణతో మెలిగిన నటులుగా మంచి పేరుంది.

డబ్బు విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఎన్టీఆర్,ఎన్నార్ ఇద్దరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు.

ఇండస్ట్రీలోకి ప్రవేశించక ముందు స్టేజీలపై నాటకాలు వేసిన ఎన్టీఆర్, ఎన్నార్ స్త్రీ పాత్రలను పోషించడం గమనార్హం.

ఎన్టీఆర్ రాచమల్లు దౌత్యం అనే నాటకంలో నాగమ్మ వేషం వేయగా నాగేశ్వరరావు హరిశ్చంద్రలో చంద్రమతి వేషం వేశారు.

నాగేశ్వరరావు, రామారావు నటించిన తొలి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.ఎన్టీఆర్ కొడుకు పేరుతో రామకృష్ణ స్టూడియోస్ ను స్థాపిస్తే నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ ను స్థాపించారు.

ఈ జోనర్ ఆ జోనర్ అనే తేడాల్లేకుండా అన్ని జోనర్ల సినిమాలలో ఎన్టీఆర్,ఎన్నార్ నటించారు.

ఎన్టీఆర్, ఎన్నార్ లను కేంద్ర ప్రభుత్వం 1968 సంవత్సరంలో రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం గమనార్హం.

ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అగ్ర నటుడిగా కొనసాగుతుండగా ఎన్నార్ కొడుకు నాగార్జున కూడా స్టార్ స్టేటస్ సంపాదించుకుని అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.

మళ్లీ జనంలోకి ఏపీ సీఎం జగన్..!