సిల్క్ స్మిత్ అరుదైన ఫొటో వైరల్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
TeluguStop.com
ఆమె తెరమీద కనిపించిందంటే చాలు కుర్రకారు ఊగిపోతారు.ఆమె ఒకస్టెప్పు వేస్తే చాలు పండు ముసలి వారు కూడా కాలు కదపాల్సిందే.
ఒకప్పుడు హీరోల కోసం కాకుండా కేవలం ఆమె కోసమే థియేటర్లకు వెళ్లేవారంటే ఆమె ఎంత ఫేమస్ అనేది అర్థం చేసుకోవచ్చు.
మరి ఇంతలా ఎవరి గురించి చెబుతున్నానో అర్థం అయిందా అదేనండి విజయలక్ష్మి అలియాస్ సిల్క్ స్మిత గురించి.
ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి.ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గానీ 80వ శతాబ్ధం నుంచి ఆమె హవా వెండి తెరమీద కొనసాగింది.
ఆమె హాట్ అండ్ హ్యాపెనింగ్ డ్యాన్సింగ్ స్టార్ గా ఓ వెలుగు వెలిగింది.
ఈమె ఉందంటే చాలు సినిమాలకు ఎక్కలేని ఆదరణ, క్రేజ్ వచ్చేస్తాయి.ఆమె కోసం ప్రత్యేకంగా అభిమాన సంఘాలు కూడా ఉండేవి.
సిల్క్ జీవితంపై సినిమా తీయగా విద్యాబాలన్ ప్రధాన పాత్రలో కూడా నటించారు.డర్టీ పిక్చర్ గా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
మరి ఇప్పుడు ఆమె గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నాం అంటారా.అదేం లేదండి ఆమె గురించి ఇప్పుడు ఓ ఫొటో విరీతంగా వైరల్ అవుతోంది.
"""/"/
కాకపోతే కొత్తదేమీ కాకపోయినా ఓ అరుదైన ఫోటో ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండింగ్ అయిపోతోంది.
దీన్ని చూసిన యూత్ మొత్తం ఆ సమయంలో సిల్క్ స్మితను ఏజ్ ఎంత ఉంటుందో అనే క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటోంది.
కాగా ఈ ఫొటో చాలా లేత వయసులో తీసిన ఫోటోలాగా కనిపిస్తుంది.ఈ ఫొటోలో సిల్క్ స్మత చాలా అందంగా కనిపిస్తోంది.
దీన్ని చూసిన వారంతా కూడా కామెంట్లతో తమ అభిమానం తెలుపుతున్నారు.కాగా స్మిత తన జీవితాన్ని విషాదకరంగా ముగించిన వెల్లిపోయిన విషయం విదితమే.
ఇప్పటికీ ఆమె గురించి ఏదో వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
అక్కడ కూడా సత్తా చాటిన బాలయ్య.. ఇకపై సరికొత్త రికార్డ్స్ క్రియేట్ కానున్నాయా?