Silk Smita : అచ్చం సిల్క్ స్మితలా ఉన్న ఈ అందమైన అమ్మాయిని చూశారా.. మతి పోవాల్సిందే!

సిల్క్ స్మిత.ఈ తరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఈమెను ఇట్టే గుర్తు పట్టేస్తారు.

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన ఐటమ్ సాంగులతో ఒక ఊపు ఊపేసింది ఈ ముద్దుగుమ్మ.

అంతేకాకుండా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆ స్టార్ హీరో సినిమాలో సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ లేకపోతే ఫ్లాపే అన్న రేంజ్ లో ఈమె క్రేజ్ ఉండేది.

తన చూపులతోనే మత్తెక్కించేది సిల్క్ స్మిత( Silk Smita ).సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగింది.

వందల సినిమాలలో నటించి మెప్పించింది.తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ,హిందీ భాషల్లో నటించి మెప్పించింది.

"""/" / అప్పట్లోనే బికినీలు, స్విమ్ సూట్( Bikinis, Swim Suit ) లతో వెండితెరను ఒక ఊపు ఊపేసింది ఈ బ్యూటీ.

అప్పట్లో స్టార్ హీరోలు అందరి సరసన చిందులు వేసింది.కానీ ఈమె అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటికే సిల్క్ స్మిత మృతి పట్ల అనేక రకాల అనుమానాలు సందేహాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా సిల్క్ స్మిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేంటి సిల్క్ స్మిత చనిపోయింది కదా మళ్ళీ సోషల్ మీడియాలో నిలవడం ఏంటా అని అనుకుంటున్నారా.

నిజంగా సిల్క్‌ స్మితనే.అదేలా సాధ్యం అంటే ఇదిగో ఇలా అంటుంది జూనియర్‌ సిల్క్‌ స్మిత అలియాస్‌ విష్ణు ప్రియ( Vishnu Priya ).

ఫేస్‌కట్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిల్క్‌ స్మితను గుర్తు చేస్తోన్న విష్ణు ప్రియను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

"""/" / ఒకప్పుడు సిల్క్ స్మిత ఇప్పుడు విష్ణు ప్రియ ఫోటోలు పక్కపక్కన పెట్టి చూస్తే నిజంగా వీళ్లిద్దరూ ట్విన్స్ ఏమో అన్న విధంగా అచ్చం పోలికలతో అలాగే ఉంది విష్ణు ప్రియ.

విష్ణుప్రియ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది మొదట ఆమెను సిల్క్ స్మిత అనే అనుకున్నారు.

కానీ తీరా చూసిన తర్వాత ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని ఓహో అని ఆశ్చర్యపోతున్నారు.

అచ్చం సిల్క్ స్మిత లాగే ఉన్న విష్ణు ప్రియ ఈమె కూడా తన చూపులతో మత్తెక్కిస్తోంది.

ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు కొన్ని చక్కర్లు కొడుతున్నాయి.