అమెరికా ఆర్ధిక నిపుణుల ఆందోళన...ముంచుకొస్తున్న మరో ముప్పు...

అగ్ర రాజ్యం అమెరికాను ఒక వైపు కరోన మహమ్మారి వేటాడి వెంటాడుతుంటే మరో పక్క ప్రకృతి తన ప్రకోపంతో వరదలతో ముంచెత్తుతోంది.

ఈ రెండు పరిణామాలతో అమెరికా ప్రజలు అల్లాడి పోతున్నారు.డెల్టా కేసులు రోజు రోజుకు పెరిగిపోవడమే కాకుండా మృతుల సంఖ్య కూడా పెరగడంతో పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది.

వరదలతో ఇప్పటి వరకూ దాదాపు 50 మంది పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

అయితే ఇవి చాలవు అన్నట్టుగా అమెరికాలో మరో సైలెంట్ క్రైసిస్ ముంచుకొస్తోందని అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

కరోనా కారణంగా అమెరికాలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు పెరిగిన విషయం అందరికి తెలిసిందే.

ఆ సమయంలో అమెరికా ప్రభుత్వం మిలియన్ డాలర్లు నిధులను విడుదల చేసి నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి అలాగే పలు కంపెనీలకు ఆర్ధిక సాయం అందించింది దాంతో అమెరికా అతిపెద్ద ఆర్ధిక విపత్తు నుంచీ బయటపడింది.

ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకపోయినా తమ కుటుంభాలను ప్రభుత్వం ఇచ్చిన బృతి తో పోషించుకున్నారు.

అయితే కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని అనుకున్న ప్రతీ సారి సరికొత్త వేరియంట్స్ అమెరికాను ఆందోళనలోకి నెట్టుతున్నాయి.

తాజాగా డెల్టా వేరియంట్ అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.దాంతో ఇప్పటికి నిరుద్యోగుల సమస్య అలానే ఉంది.

కానీ నిరుద్యోగ బృతిని విరమించాల్సిన పరిస్థితులు వచ్చాయి.దాంతో లక్షలాది మంది నిరుద్యోగుల బృతి పై నీలి నీడలు అలుముకున్నాయి.

ఒక పక్క డెల్టా వేరియంట్, మరో పక్క ఉద్యోగాలు లేకపోవడం, ఇప్పుడు నిరుద్యోగ బృతికి గండి పడటం ఇవన్నీ ఆర్ధిక పరిస్థితికి ముప్పు కలిగించనున్నాయని అంటున్నారు నిపుణులు.

ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాలు గడువు కంటే ముందుగానే నిరుద్యోగ బృతిని నిలిపివేశాయి.

దాంతో ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరిగిపోయింది.ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

అయితే ఈ విషయంపై ప్రభుత్వం సరైన పద్దతిలో స్పందించక పొతే ఎంతో మంది అమెరికన్స్ ఆకలి కేకలు వినాల్సి వస్తుందని, ఒక పక్క వారికి సాయం అందిస్తూనే, ఆర్ధిక పరిస్థితులను అంచనా వేసుకోవాలని, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.

అణుదీప్ కేవి ఇప్పుడు చేయబోయే సినిమాతో స్టార్ డైరెక్టర్ అవుతాడా..?