వలస నేతలకు పెద్ద పీట .. జన’సైనికులు’ కాబట్టే సైలెన్స్ 

టిడిపి, బిజెపి( TDP, BJP ) పొత్తుల భాగంగా 175 అసెంబ్లీ,  25 పార్లమెంట్ స్థానాలకు గాను 21 అసెంబ్లీ,  రెండు పార్లమెంట్ స్థానాలను జనసేన పొత్తులో భాగంగా తీసుకుంది.

దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.అయితే ఈ స్థానాల్లో మొదటి నుంచి జనసేనలో కష్టపడిన నాయకులకు కొన్ని స్థానాలు దక్కగా ,  చాలా స్థానాల్లో టిడిపి , వైసిపిల( TDP , YCP )) నుంచి వలస వచ్చిన నేతలకే పవన్ పెద్దపీట వేయడం ఆ పార్టీలో చర్చనీయంశం గా మారింది.

పార్టీ మారి వచ్చిన వారికి టిక్కెట్ ను ఖరారు చేయడంపై లోలోపల జనసేన ఆశావాహుల్లో తీవ్ర అసంతృప్తి నెలకు ఉంది .

అయితే పవన్( Pawan ) కీలక స్థానంలో చూడాలనే ఆశతో ఉన్న సైనికులు పవన్ తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం లేదు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేసి మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టడం మంచిది కాదనే అభిప్రాయం ఉన్నా.

పవన్ మాత్రం పట్టించుకోవడం లేదు. """/" / కేవలం వైసీపీ ఏపీలో మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యంగా అనే సందర్భంలో ప్రకటించారు.

తాజాగా అవనిగడ్డ నుంచి మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్( MLA Mandali Buddha Prasad ) జనసేనలో చేరారు.

ఆయనకు అవనిగడ్డ స్థానాన్ని కేటాయించారు.వాస్తవంగా అవనిగడ్డలో ఐవిఆర్ఎస్ సర్వేను పవన్ కళ్యాణ్ చేయించారు.

వికృతి శ్రీనివాస్,  బండ్రెడ్డి రామకృష్ణ,  బండి రామకృష్ణ పేర్లను పరిశీలించారు.అయినా వారి పేర్లను పక్కన పెట్టారు.

టిడిపి, జనసేన పొత్తు లో భాగంగా అవనిగడ్డ జనసేన కేటాయించడంతో,  మండలి బుద్ధ ప్రసాద్ అభిమానులు టిడిపికి రాజీనామా చేశారు.

అయితే చంద్రబాబు( Chandrababu ) సూచన మేరకు మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరి టికెట్ తెచ్చుకున్నారు.

"""/" / చాలాచోట్ల టిడిపి నాయకుల జనసేన కండువా కప్పుకుని టికెట్ దక్కించుకోవడంపై జనసేన నాయకుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి.

టిడిపి పథకం ప్రకారం ఈ విధంగా చేస్తూ పవన్ ను మోసం చేస్తున్నారని ఆగ్రహం కూడా ఉంది .

అయితే అధినేత ధిక్కరించలేక సైలెంట్ గానే ఉండిపోతున్నారు.ఇటీవల భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు టిడిపి నుంచి వచ్చి చేరారు.

అలాగే తిరుపతి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు,  పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు,  వంశీకృష్ణ యాదవ్ వైసీపీ నుంచి వచ్చి పదవులు పొందారు.

అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి కూడా వైసీపీ నుంచి వచ్చిన వారే.

అయ్యబాబోయ్.. మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడ్లను చూసారా?