30 ఏళ్లుగా జైళ్లలోనే .. ఆ సిక్కులను విడుదల చేయండి : మోడీకి ప్రవాసీ సిక్కు సంస్థ లేఖ

దాదాపు 30 ఏళ్లుగా భారతీయ జైళ్లలో మగ్గుతున్న సిక్కులందరినీ విడుదల చేయాలని ప్రవాసీ సిక్కు సంస్థ 'Sikhs Of America' భారత ప్రధాని నరేంద్ర మోడీని కోరింది.

ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు ఈ సంస్థ ప్రతినిధులు.ఈ సమస్యను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఎంతమంది సిక్కులు జైళ్లలో మగ్గుతున్నారో, ఎన్ని జైళ్లలో వున్నారో కనుగొనాలని వారు మోడీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

చాలామంది సిక్కులు కోర్టు నుంచి తీర్పు వచ్చినప్పటికీ ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారని సిక్స్ ఆఫ్ అమెరికా ఆవేదన వ్యక్తం చేసింది.

అనధికారిక లెక్కల ప్రకారం ఇలా జైళ్లలో వున్న సిక్కుల సంఖ్య 800పైనే వుంటుందని ఆదివారం అమెరికాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.

వీరిలో చాలామంది 80, 90వ దశకాలలో పంజాబ్‌లో కాంగ్రెస్ సృష్టించిన మిలిటెంట్ వాతావరణంలో రాజకీయ నేరాలకు పాల్పడ్డారని సిక్స్ ఆఫ్ అమెరికా తెలిపింది.

వీరిపై టాడా తో పాటు ఇతర తీవ్రవాద వ్యతిరేక క్రూరమైన చట్టాల కింద కేసులు నమోదు చేశారని సిక్స్ ఆఫ్ అమెరికా ఆరోపించింది.

"""/" / ప్రతి ఏడాది వివిధ రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి, ఓట్లు పొందుతాయని సిక్స్ ఆఫ్ అమెరికా ఛైర్మన్ జస్దీప్ సింగ్, ఆ సంస్థ అధ్యక్షుడు కమల్‌జిత్ సింగ్ సోనీ లేఖలో పేర్కొన్నారు.

భారతీయ జైళ్లలో ఎంతమంది సిక్కులు బందీలుగా వున్నారో తేల్చాలని వారు ప్రధాని మోడీని కోరారు.

ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో సిక్కులు, సిక్కు గురువుల త్యాగాలను గుర్తించిందని వారు ప్రశంసించారు.

ఈ స్పూర్తితో.జైళ్లలో మగ్గుతున్న సిక్కులను క్షమించి, విడుదల చేయాలని వారు కోరారు.

తల్లి స్వీపర్.. సివిల్స్ లో సత్తా చాటిన కొడుకు.. ఇతని సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!