పోషకాల లోపం కనిపెట్టేదెలా.. ఆ సంకేతాలేంటి..?
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో మంది పోషకాల లోపంతో( Nutrient Deficiency ) బాధపడుతున్నారు.
విచిత్రం ఏంటంటే తాము పోషకాల లోపానికి గురయ్యామని సగం శాతం మంది తెలుసుకోలేకపోతున్నారు.
శరీరానికి పోషకాలు తగినంతగా అందకపోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
అసలు పోషకాల లోపాన్ని కనిపెట్టేదెలా.? శరీరం ఎటువంటి సంకేతాలను ఇస్తుంది.
? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.తరచుగా పెదవులు, నాలుక, వేళ్లు మరియు పాదాలలో జలదరింపు, కండరాల నొప్పులు కాల్షియం లోపాన్ని( Calcium Deficiency ) సూచిస్తాయి.
అలాగే శరీరంలో మెగ్నీషియం( Magnesium ) కంటెంట్ తగ్గినప్పుడు ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, అలసట, బలహీనత, చేతులు మరియు కాళ్లలో తిమ్మిరి, అరచేతులు చల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
"""/" /
చర్మంపై దద్దుర్లు, పగుళ్లు, జుట్టు అధికంగా రాలిపోవడం, గోళ్ల మీద తెల్లని మచ్చలు ఏర్పడటం, గోళ్లు మెత్తగా మారి విరిగిపోవడం, అస్పష్టమైన దృష్టి వంటి సంకేతాలు జింక్( Zinc ) లోపాన్ని సూచిస్తాయి.
చర్మం పాలిపోవడం, విపరీతమైన అలసట, శక్తి లేకపోవడం, గుండె దడ, తలతిరగడం, చల్లని చేతులు, తలనొప్పి వంటి లక్షణాలు మీలో ఉంటే అది ఐరన్ లోపంగా గుర్తించాలి.
"""/" /
కీళ్ల నొప్పులు, బలహీనత, చిరాకు, చర్మంపై ఎరుపు లేదా నీలం రంగు మచ్చలు రావడం, జుట్టు పొడిగా పెళుసుగా మారడం వంటివి విటమిన్ సి( Vitamin C ) లోపానికి సంకేతాలు.
ముఖంపై మరియు ముక్కు పక్కల చర్మం ఎర్రగా కంది తోలు లేస్తుంటే విటమిన్ బి2 లోపం గా భావించాలి.
గందరగోళం, మతిమరుపు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మానసిక మార్పులు, పెరిగిన హృదయ స్పందన రేటు, నీరసం, జలదరింపు వంటివి విటమిన్ బి12 తగ్గించదని చెప్పే లక్షణాలు.
మలబద్ధకం, ఉబ్బరం, తిన్న వెంటనే మీకు ఆకలిగా అనిపించడం ఫైబర్ లోపం సంకేతాలు.
ఇక లోపాలను నివారించడానికి మీరు సమతుల్య ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే వివిధ రకాల ఆహారాలను చేర్చవచ్చు.
ఆకుపచ్చ ఆకు కూరలు, సీజనల్ పండ్లు, గింజలు, మొలకెత్తిన విత్తనాలు, బీన్స్, తృణధాన్యాలు, చేపలు, గుడ్లు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, నట్స్ వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోండి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌కు షాక్ , కమలా హారిస్‌కు ఊహించని మద్ధతు