రేపే రంజాన్... పండుగ విశిష్టత.. ప్రాధాన్యత ఏమిటో తెలుసా?

ముస్లిం మతస్థులు ఎంతో ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో రంజాన్ పండుగ ఒకటి.

ఈ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైనది.నెల రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో కఠిన నియమాలను పాటిస్తూ ఉపవాస దీక్షలతో ఈ పండుగను జరుపుకుంటారు.

ముస్లిం పవిత్ర మాసమైన రంజాన్ నెల మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు కటిక ఉపవాసం ఉంటూ, అల్లాను ప్రార్థిస్తుంటారు.

రంజాన్ నెల ముగింపు రోజున ముస్లింలు పెద్ద ఎత్తున ఈ వేడుకను నిర్వహించుకుంటారు.

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం షావ్వాల్ నెల ప్రారంభాన్ని గుర్తించడానికి ఈ రోజును జరుపుకుంటారు.

హిజ్రి చంద్ర నెల ఈద్ తేదీ తేదీకి భిన్నంగా ఉంటుంది.ఇండియాలో ఈ పండుగ మే14 న జరుపుకుంటారు.

రంజాన్ పండుగ రంజాన్ నెల మాసం పూర్తయి అమావాస్య తరువాత చంద్రుడు కనిపించిన మరుసటి రోజు ఈ పండుగను నిర్వహించుకుంటారు.

ముహమ్మద్ ప్రవక్త ఈద్- ఉల్- ఫితర్ ను ప్రారంభించారు.అనాస్ బిన్ మాలిక్ ముహమ్మద్ యొక్క సహచరుడు, ముహమ్మద్ మక్కా నుంచి మదీనాకు వలస వచ్చినప్పుడు అతను వలస వచ్చినప్పుడు ఈద్- ఉల్- ఫితర్ ను స్థాపించాడని, ముహమ్మద్ ప్రవక్త ముస్లింల పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని ఆవిష్కరించినది కూడా ఈ నెలలోనే కనుక ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.

రంజాన్ పండుగ రోజు ముస్లింలు మసీదుకు చేరుకొని భగవంతుని ప్రార్థిస్తారు. """/"/ ఈ పండుగ రోజు ముస్లింలందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు.

అదేవిధంగా ఈ పండుగ రోజున ముస్లిమ్స్ వారి స్థోమతకు తగ్గట్టుగా దానధర్మాలను చేస్తారు.

రంజాన్ పండుగను రెండు రోజుల పాటలు ఎంతో ఆనందంగా జరుపుకునే వారు.ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా పండుగను ఎవరి ఇళ్లలో వారు జరుపుకోవాలని అధికారులు సూచించారు.

బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..: డిప్యూటీ సీఎం భట్టి